అక్కినేని నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకుంటుండడం అందరికీ ఒకింత షాక్ కు గురి చేసింది. క్యూట్ కపుల్ లా ఎప్పుడూ అనిపించే వీరు ఎందుకు విడిపోయారు అన్నదానిపై ఎవరికి వారు విమర్శలు చేసుకున్నారు. సమంత పిల్లలు కనడానికి సిద్ధంగా లేకపోవడం కారణంగానే నాగ చైతన్య విడిపోవాలి అనుకున్నాడని చాలా మంది వార్తలు వ్యాప్తి చేసారు.
ఇదిలా ఉంటే సమంత నటించిన శాకుంతలం నిర్మాత నీలిమా గుణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ “తల్లి కావాలని సామ్ చాలా కలలు కంది. శాకుంతలం చిత్రంలో నటించమని మా నాన్న గుణశేఖర్ ఈ ఏడాది ప్రారంభంలో ఆమె వద్దకు వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ నచ్చిందని కానీ తనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పింది. జూన్ కల్లా సినిమా పూర్తి చేస్తానని మాట ఇస్తేనే సినిమాకు సంతకం చేస్తానని సమంత తెలిపింది. ఎందుకని అడిగితే జూన్ తర్వాత సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటున్నట్లు పిల్లలను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఆమె పెట్టిన కండిషన్ ప్రకారంగానే జూన్ కు చిత్రాన్ని పూర్తి చేసాం” అని నీలిమ తెలిపింది.