ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ ఫ్రాంచైజ్ తో రెండు బ్లాక్ బస్టర్లు కొట్టాడు. ఈ రెండు సినిమాలతో ప్రశాంత్ నీల్ ఫేమ్ ఆకాశాన్ని తాకే రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న చిత్రం సలార్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో సాగుతోంది. ఇదిలా ఉంటే సలార్ కు సంబంధించిన కీలక అప్డేట్ ఒకటి ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం సలార్ లో కేజిఎఫ్ లింక్ ఉంటుందని అంటున్నారు. కేజిఎఫ్ కు సంబంధించిన సీన్ సలార్ లో ఉంటుందిట. దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా ఈ రెండు చిత్రాలకు లింక్ కుదిర్చాడని అంటున్నారు.
అది కచ్చితంగా ఆడియన్స్ కు షాకింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఇంకా ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే యష్, సలార్ లో ఒక సీన్ లో మెరుస్తాడట. వింటుంటేనే ఇలా ఉంటే నిజంగా జరిగితే ఎలా ఉంటుందో కదా.