పాత్రికేయ వ్యభిచారం.. అని నిస్సందేహంగా అనెయ్యొచ్చు.! ఎందుకంటే, వైసీపీ అధికారిక పత్రిక సాక్షిలో ఎప్పుడూ నిజాలు కనిపించవు. అందులో నిజాలు వుండవనీ, తప్పు రాస్తారనీ.. తప్పుడు పత్రిక సాక్షి గురించి, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో.. ముఖ్యమంత్రి హోదాలో వున్నప్పుడు స్వయానా ఆ సాక్షిని స్థాపించి, నడుపుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు మరి.!
అసలు విషయానికొస్తే, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, క్యాబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టారంటూ సాక్షి మీడియాలో ఓ కథనం వచ్చింది. డిప్యూటీ సీఎం డుమ్మా కొట్టడంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన చెందారన్నది ఆ కథనం తాలూకు సారాంశం. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్, క్యాబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టినట్లు కథనాన్ని వండి వడ్డించింది సాక్షి.
కానీ, అదే సమయంలో పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశంలోనే వున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవహారం గురించీ, హోంశాఖ అలాగే పోలీసు శాఖలో కొందరు ఉన్నతాధికారుల పని తీరు గురించీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వైసీపీ పెంచి పోషిస్తోన్న కొన్ని అసాంఘీక శక్తుల ప్రవర్తనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు కూడా.
చిత్రంగా, పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశానికి డుమ్మా.. అని తప్పుడు కథనాన్ని ప్రచారంలోకి తెచ్చిన సాక్షి, ఆయన క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారని ఇంకో కథనాన్ని తీసుకువచ్చింది. నిజానికి, డిప్యూటీ సీఎంకి వ్యతిరేకంగా రాసిన దురుద్దేశపూరిత కథనంగా, ‘డుమ్మా’ కథనంపై రాష్ట్ర ప్రభుత్వం ఈపాటికే చర్యలు ప్రారంభించి వుండాలి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు మధ్య ‘పుల్లలు’ పెట్టి, ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు సాక్షి మీడియా పన్నిన కుట్రపై, ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి చర్యలు ప్రారంభమైన దాఖలాల్లేవు. ఈ ఉదాసీనత నిజానికి క్షమార్హం కాదు.
సాక్షిలో తప్పు రాస్తారని జగన్, తెలివిగా అప్పట్లో ‘సన్నబియ్యం’ వ్యవహారంపై చేతులత్తేశారుగానీ.. ఇది మాత్రం చాలా చాలా సీరియస్ అంశం. తప్పుడు పత్రిక సాక్షిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా, డిప్యూటీ సీఎం స్వయంగా బాధ్యత తీసుకోవాలేమో ఇప్పుడు.!