మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ విడుదల కోసం.. అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారు. చిరంజీవి జన్మదినమైన ఆగష్టు 22న ఈ సినిమా విడుదల చెయ్యాలని తొలుత నిర్మాత రామ్ చరణ్ భావించినప్పటికీ .. నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం వల్ల , అభిమానులను నిరాశకు గురి చేయకుండా.. అదేరోజు ట్రైలర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
‘సైరా’ బడ్జెట్ 150 కోట్లు అని ముందు అంచనా వేశారు. కానీ.. బడ్జెట్ అదుపు తప్పింది.. ఒక దశలో దర్శకుడు సురేందర్ రెడ్డికి, రామ్ చరణ్ కు మధ్య బడ్జెట్ విషయంలో తేడాలొచ్చాయి. ముఖ్యంగా సురేందర్ రెడ్డి ఎక్కువ సమయం తీసుకుంటున్నాడని చిరంజీవి, రామ్ చరణ్ లు వ్యాఖ్యానించగా.. అది తెలుసుకున్న సురేందర్ రెడ్డి.. తనకు ప్రొడక్షన్ లో పూర్తి స్వేచ్ఛ ఉంటేనే.. షూటింగ్ కొనసాగించగలనని స్పష్టం చేసాడు. కాగా, ఆ దశలన్నీ దాటుకొని ‘సైరా’ షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుంది.
సమన్వయలోపం వల్ల.. అంటే కాంబినేషన్లు సర్దుబాటుకాక.. అమితాబ్ బచ్చన్.. ,ముఖ్యంగా నయనతార డేట్స్ వల్ల మితిమీరిన జాప్యం జరిగిందని .. దీని వల్ల బడ్జెట్ పెరిగిందంటున్నారు. ప్లానింగ్ తగిన విధంగా చేసుకొని ఉంటే.. 50 కోట్లు వరకు బడ్జెట్ తగ్గివుండేదంటున్నారు. బడ్జెట్ పెరిగినప్పటికీ.. ఫాన్సీ రేట్లకు పంపిణీదారులు ముందుకు రావడం వల్ల.. ఈ సినిమా రామ్ చరణ్, చిరంజీవిలకు లాభాల పంట పండిస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ‘సైరా’ చిరంజీవి బర్త్ డేకు రాలేక పోతుంది కాబట్టి .. దసరా సీజన్ కైనా విడుదల చేస్తారా? అన్నది చూడాలి !