మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథతో తెరకెక్కే ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజుతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. నేడు షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టి కంప్లీట్ చేయనున్నారు.
దాదాపు ఏడాది కాలంగా సైరా షూటింగ్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తీ చేసారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమా విషయంలో నిర్మాత రామ్ చరణ్ నిర్వహిస్తున్న బాధ్యతలను మెగాస్టార్ కు అప్పగించేసాడు. ఎందుకంటే చరణ్ జులై నుండి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీ కానున్నాడు కాబట్టి .. ఈ బాధ్యతలను చిరుకు అప్పగించాడట.
సైరా సినిమా ఇప్పటికే అటు ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే బిజినెస్ పరంగా ఎంక్వయిరీలు వస్తున్నాయట. కొన్ని ప్రముఖ ఏరియాలకు భారీ రేటుతో ఇద్దరు ముగ్గురు డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 22 న ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసి అక్టోబర్ 2న అంటే దసరా ముందు ఈ సినిమాను అంతే భారీ స్థాయిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాను విడుదల చేస్తారట. ఈ సినిమా తరువాత మెగాస్టార్ అప్పుడే నెక్స్ట్ సినిమాకు ఓకే తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా మెగాస్టార్ పుట్టిన రోజున ప్రారంభం కానుందట.