Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితిపై లీలావతి ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. సైఫ్ కు ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
‘ సైఫ్ కు వెన్నెముకలో కత్తితో పొడవటంతో తీవ్ర గాయమైంది. ఆయనకు శాస్త్ర చికిత్స చేసి కత్తిని తొలగించాం. సైఫ్ ఎడమ చేయి, మెడపై కూడా గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావమైంది. ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశాం. ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు ‘ అని లీలావతి ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.
మరోవైపు.. బాంద్రా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పది బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. చుట్టుపక్కల సీసీ టీవీ కెమెరాల జల్లెడ పడుతున్నారు. ఇంట్లో పని మనిషి స్టేట్మెంట్ ఆధారంగా నిందితుడు దొంగతనానికి వచ్చాడని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈరోజు అర్థరాత్రి గుర్తు తెలియని దుండగుడు సైఫ్ ఇంట్లోకి చొరబడి ఆయన్ను కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.