విభిన్నమైన సబ్జెక్టులతో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు సాయి దుర్గా తేజ్. SDT18 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న తన నెక్స్ట్ మూవీ తాజాగా మేజర్ యాక్షన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. రోహిత్ కే పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 15 రోజులపాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో భారీ సెట్ రెడీ చేశారు. ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని లుక్ లో సాయి తేజ్ కనిపించనున్నారు. ఆయన సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇతర నటినటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.