రీల్ హీరోగా అందరు కనిపిస్తారు కానీ రియల్ హీరో అనిపించుకోవడం అన్నది చాలా అరుదు. అలాంటిది తన దృష్టికి వచ్చిన ఎలాంటి సమస్యకైనా తనకు తోచిన సాయం చేస్తూ ప్రజలను కూడా సాయం చేసేలా ప్రభావితం చేస్తున్నాడు మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్. తాజాగా లివర్ డిసీజ్ తో బాధపడుతున్న ఇక్రా హయా అనే చిన్నారి కోసం తేజ్ అండగా ఉంటూ దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లివర్ డిసీజ్ తో బాధపడుతున్న ఇక్రా హయా హైదరాబాద్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ నందు చికిత్స పొందుతున్నారు.
ఆమె చికిత్స కోసం చాలా డబ్బు అవసరం ఉండగా చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు సాయి దుర్గ తేజ్ తన వంతు సాయం చేశారు. ఐతే ఆయన ఒక్కడే కాకుండా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని కూడా విరాళాలు అందించాలని కోరారు. సాయి తేజ్ ఇచ్చిన పిలుపు మేరకు చాలామంది ఇక్రా హయా చికిత్స కోసం సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
తాజాగా సాయి తేజ్ మరోసారి తన ట్విట్టర్ వేదికగా చిన్నారి జీవితంలో భాగస్వామ్యం అవుదాం.. ఆమె చికిత్స కోసం సహాయ పడండి అని మెసేజ్ చేశారు. అంతేకాదు ఇప్పటివరకు ఆర్ధిక సాయం చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు సాయి దుర్గ తేజ్. ఇది కేవలం డబ్బుకి సంబందించిన విషయం కాదని మీ హృదయానికి సంబందించిందని అన్నారు తేజ్.
https://x.com/IamSaiDharamTej/status/1887724111641895072?t=zwg7owPH4ZFU9jjgt9E_UQ&s=19