Switch to English

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ రివ్యూ

Critic Rating
( 3.00 )
User Rating
( 3.50 )

No votes so far! Be the first to rate this post.

Movie రిపబ్లిక్‌
Star Cast సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్, జగపతిబాబు
Director దేవ కట్టా
Producer జె. భగవాన్, జె. పుల్లారావు
Music మణిశర్మ
Run Time 2h 32m
Release 01 అక్టోబర్ 2021

సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా రమ్య కృష్ణ, జగపతి బాబు తదితరులు నటించిన చిత్రం రిపబ్లిక్. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవా కట్టా ఈ సినిమాను రూపొందించాడు. ఈ చిత్రం నేడు డీసెంట్ అంచనాల మధ్య విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

పంజా అభిరామ్ (సాయి ధరమ్ తేజ్) ఒక తెలివైన విద్యార్థి. అయితే తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, ఈ సమాజాన్ని బాగు చేయడం కోసం అతను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. అక్కడి నుండి ఒక అవినీతి రాజకీయ నాయకురాలు (రమ్యకృష్ణ)కు అభిరామ్ ఎదురవుతాడు. తాను చేయాలనుకుంది చేయడానికి ఎలాంటి తప్పునైనా చేసే ఆమెకు అభిరామ్ ఎలా ఎదురువెళ్ళాడు? ఆ తర్వాత ఏం జరిగింది? వేళ్ళూనుకునిపోయి ఉన్న రాజకీయ వ్యవస్థను మార్చడానికి నడుం బిగించిన బ్యూరోక్రాట్ విజయం సాధించగలిగాడా అన్నది రిపబ్లిక్ లోని ప్రధాన పాయింట్.

పెర్ఫార్మన్స్:

సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మన్స్ పరంగా అదరగొట్టాడు. మొదటిసారి ఒక ప్రభుత్వ అధికారి పాత్రను పోషించాడు తేజ్. మొత్తంగా హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. రమ్యకృష్ణ ఒక అవినీతి రాజకీయ నాయకురాలి పాత్రలో జీవించింది. బలమైన పాత్రలు పడితే రమ్యకృష్ణ చెలరేగిపోతుంది అనడానికి ఈ చిత్రం మరో ఉదాహరణ. ఐశ్వర్య రాజేష్, రాహుల్ రామకృష్ణ, జగపతి బాబువి చిన్న పాత్రలే అయినా కూడా వాటి ఇంపాక్ట్ బాగుంటుంది. ఈ చిత్రంలో కాస్టింగ్ సరిగ్గా సరిపోయింది.

సాంకేతిక వర్గం:

సమాజం, రాజకీయం.. వీటితో ముడిపడ్డ సబ్జక్ట్స్ ను ఎక్కువగా డీల్ చేస్తుంటాడు దేవా కట్టా. తన రెండో చిత్రం ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, ఇప్పుడు రిపబ్లిక్ ఇవన్నీ అవే జోనర్ కు చెందినవి. రిపబ్లిక్ లో సెన్సిబుల్ స్క్రీన్ ప్లే తో ఇంప్రెస్ చేస్తాడు. ఎక్కడా సబ్జెక్ట్ నుండి డీవియేట్ కాకుండా తాను అనుకున్నది చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇలాంటి సినిమా రావడం చాలా అవసరం అనిపిస్తుంది. ముఖ్యంగా హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ ను దేవా కట్టా బాగా హ్యాండిల్ చేసాడు.

మణిశర్మ అందించిన పాటలు పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మణిశర్మ రాజి పడలేదు. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్లలో ఆయన పనితనం మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ టాప్ లెవెల్లో ఉంది.

ప్లస్ పాయింట్స్:

  • కథ, సంభాషణలు
  • స్క్రీన్ ప్లే
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • ప్రధాన పాత్రధారుల పెర్ఫార్మన్స్

మైనస్ పాయింట్స్:

  • సినిమా అంతా సీరియస్ గా సాగడం
  • “ఆశ లేదు” అనేలా మెసేజ్ ఇవ్వడం

విశ్లేషణ:

రిపబ్లిక్ ఎక్కడా డీవియేట్ కాకుండా తెరకెక్కిన ఒక సామజిక రాజకీయ కథ. దేవా కట్టా సిన్సియర్ అప్రోచ్, సాయి ధరమ్ తేజ్ హానెస్ట్ పెర్ఫార్మన్స్ కలిసి రిపబ్లిక్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ఎక్కడా డీవియేషన్స్ లేకుండా దేవా కట్టా తెరకెక్కించిన ఈ చిత్రం కచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది.

తెలుగు బులెటిన్ రేటింగ్ : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సాయి ధరమ్ తేజ్‌ ను కలిసిన హరీష్‌ శంకర్‌

యాక్సిడెంట్‌ కు గురయ్యి చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న సాయి ధరమ్‌ తేజ్ ను సన్నిహితులు ఇంటికి...

ముక్కు అవినాష్‌ పెళ్లి తంతు పూర్తి

కమెడియన్‌ గా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ముక్కు అవినాష్ బిగ్‌ బాస్ కు వెళ్లినప్పటి నుండి పెళ్లి పెళ్లి అంటూ హడావుడి చేశాడు....

సమంత పరువు నష్టం దావా

స్టార్‌ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్‌ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. తాను విడాకుల గురించి సోషల్‌ మీడియాలో వెళ్లడించిన సమయంలో కొన్ని...

క్లైమాక్స్ కోసమే 50 కోట్లు ఎందుకు డార్లింగ్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. మూడేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం బోలెడన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ ను...

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నాడా? 2022 తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదు అని భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లోకి...

రాజకీయం

బాబు దీక్షకు పోటీగా వైకాపా దీక్షలు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటల దీక్షను చేసేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం...

హద్దు మీరితే ఇకపై కూడా ఇలాగే ఉంటుంది : సజ్జల

తెలుగు దేశం పార్టీ నాయకులు హద్దు మీరి దుర్బాషలాడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. వారు ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకునేది లేదు అంటూ సజ్జల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు...

నారా లోకేష్‌ ఉగ్ర స్వరూపం

ఏపీలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బంద్ పాటించేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు మాత్రం ఎక్కడికి...

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అవసరమా.? కాదా.?

అధికార పార్టీకి చెందిన నేతలైతే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి బూతులు తిట్టొచ్చు.. వాటిపై విపక్షాలకు చెందిన నేతలు సమాధానం కూడా చెప్పకూడదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు.. ఇంకోటేదో...

బీపీ, రియాక్షన్… ఇదేం సమర్థన సీఎం జగన్ గారూ.?

‘ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక నా మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. నన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో నన్ను అభిమానించేవారు, ప్రేమించేవారు బీపీకి...

ఎక్కువ చదివినవి

మాజీ సీఎం స్మారక చిహ్నంకు జనసేన కోటి నిధి

పవన్‌ కళ్యాణ్ అమరులను గుర్తు చేసుకోవడంలో ముందు ఉంటారు. గొప్ప వారి అడుగు జాడల్లో నడిచేందుకు గాను వారి యొక్క జ్ఞాపకాలు ఉండాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ...

పవన్-విష్ణు మాట్లాడుకోలేదనే వార్తలపై మంచు లక్ష్మీ క్లారిటీ..!!

ఇటివలే మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఈక్రమంలో రేణిగుంట ఎయిర్ పోర్టుకు సోదరి మంచు లక్ష్మీతో కలిసి వెళ్లారు. వారికి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు....

జస్ట్ ఆస్కింగ్: గుండెపోటు వచ్చి నరుక్కున్నట్టేనా.?

మొదట గుండె పోటు వచ్చింది.. ఆ తర్వాత గొడ్డలితో అతి కిరాతకంగా తనను తానే నరుక్కుని చచ్చిపోయాడో పెద్దాయన.! కాన్సెప్ట్ అదిరిపోయింది కదూ.! బాత్రూమ్‌లో బాబాయ్ కథ ముగిసిపోయిన వైనాన్ని రాజకీయంగా ఎలా...

స్పిరిట్ లో ప్రభాస్ కు విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

ప్రభాస్ ప్రస్తతం రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈక్రమంలో మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ డైరక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే...

ఆమె నటనకు ఆస్కార్‌ వస్తుంది కాని మా పార్టీలో చోటు లేదు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారకం వద్ద శశికళ నివాళ్లు అర్పించారు. ఆ సమయంలో కాస్త రాజకీయ హడావుడి కనిపించింది. అన్నాడీఎంకే జెండాలు పట్టుకున్న అభిమానులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ...