ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు వరుస పరాజయాలు మెగా మేనల్లుడు సాయి తేజ్ ని టెన్షన్ పెట్టాయి. ఆ దెబ్బకు ఆయనకు అవకాశాలు లేకుండా పోయాయి. దాంతో కొంత మేక్ ఓవర్ మర్చి .. ఫేట్ మారుతుందేమో అని చిత్రలహరి అనే సినిమాతో కొత్త ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నం హిట్ అయి .. సాయి ధరమ్ తేజ్ ని కాస్త సాయి తేజ్ గా మర్చి మళ్ళీ గాడిలో పడేసింది. ఆ సక్సెస్ తో ప్రస్తుతం మారుతీతో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు సాయి తేజ్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. ఈ సినిమాతో పాటు మరో దర్శకుడికి ఆయన ఓకే చెప్పడంతో ఇప్పుడు అందరు షాక్ అవుతున్నారు.
ఇప్పటికే చిత్రలహరితో గట్టెక్కావు అనుకుంటే .. మళ్ళీ ప్లాప్ దర్శకుడితో సినిమా ఏమిటి ? అంటూ అందరు అంటున్నారు. ఇంతకి ఆ దర్శకుడు ఎవరో కాదు .. దేవా కట్ట. అప్పట్లో వెన్నెల చిత్రంలో దర్శకుడిగా పరిచయం అయిన దేవా కట్ట ప్రస్థానం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఆటోనగర్ సూర్య, డైనమైట్ సినిమాలు చేసి పరాజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత చాలా రోజులుగా ఆ దర్శకుడు ఎక్కడ కనిపించడం లేదు .. మళ్ళీ ఇన్నాళ్లకు రీ ఎంట్రీ కి రెడీ అయ్యాడు దేవా కట్ట.
మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథతో ఈ సినిమా ఉంటుందని టాక్. ప్రస్థానం తరహాలోనే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే కథా చర్చలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుతున్నాడట దేవా కట్ట. త్వరలోనే ఈ సినిమా పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ప్లాప్ దర్శకుడితో సాయి తేజ్ గేమ్ ఆడుతున్నాడా ఏమిటి ? అంటూన్నారు సినీ జనాలు.