యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించిన నువ్వే కావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తాజాగా రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం ‘ఉషా పరిణయం’. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఉషా పరిణయం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ వేడుకకి సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు. ఇంకా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. చిత్ర యూనిట్ సభ్యులకు అతిథులు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. సతీష్ అన్న కూతురు తన్వీ ఆకాంక్ష కు నేను ఒక అన్నయ్య గా ఈ ఫంక్షన్ కు వచ్చాను. విజయ్ భాస్కర్ గారి దర్శకత్వంలో నేను ప్రేమ కావాలి సినిమా చేయాల్సింది. కానీ ఆ సినిమా మిస్ అయ్యాను. మంచి దర్శకుడు. కమల్ నాకు జిమ్ లో చాలా కాలంగా పరిచయం. చాలా కష్టపడుతాడు. హీరోగా కమల్ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు ధ్రువన్ ఆర్‌ఆర్ ఇచ్చిన సంగీతం చాలా బాగుంది. తన్వీ ఆకాంక్ష షార్ట్ ఫిల్మ్స్ చేసి తనంతట తాను ఎదిగింది. ఈ సినిమాతో ఆమె మంచి గుర్తింపు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను అన్నాడు.
దర్శకుడు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ సాయి ది రియల్‌హీరో.. సాయిని 14 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారి నిర్మాణ సారథ్యంలో నేనే హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలి కానీ కుదరలేదు. మమ్ములను టీమ్‌ను ఎంకరైజ్ చేయడానికి వచ్చినందుకు ఆనందంగా వుంది. తన్వీ స్వీటెస్ట్ గర్ల్. చాలా కంఫర్టబుల్ హీరోయిన్ అన్నారు.
హీరో శ్రీకమల్ మాట్లాడుతూ అందరి పూర్తి సహకారంతో ఓ మంచి సినిమాను అందిస్తున్నాం. అనుకున్న టైమ్ కంటే ముందే షూటింగ్‌ను పూర్తిచేశాను. సాయి దుర్గ తేజ్‌కు నేను అభిమానిని. ఆయన రావడం ఎంతో మధురానుభూతి అన్నారు.
హీరోయిన్ త్వాన్వీ ఆకాంక్ష మాట్లాడుతూ ‘సాయి దుర్గ తేజ్ అన్న రావడం చాలా సంతోషంగా వుంది. నేను సక్సెస్ అవుతుంటే ఆనందపడే వ్యక్తుల్లో సాయి అన్న ఒకరు. విజయ్‌భాస్కర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. కమల్‌తో పనిచేయడం చాలా కంఫర్ట్‌గా వుంది. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుంది’ అన్నారు.