Priyadarshi: ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన ‘సారంగపాణి జాతకం’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమా నిర్మించారు. గతంలో వీరి కాంబినేషన్లో జెంటిల్మెన్, సమ్మోహనం సినిమాలు వచ్చాయి. ఈ సందర్భంగా..
శివలెంక కృష్ణప్రసాద్.. ”సారంగపాణి జాతకం’ మంచి కామెడీ సినిమా. నాకెప్పటినుంచో పూర్తి కామెడీ సినిమా నిర్మించాలని కోరిక. మా సంస్థలో ‘చిన్నోడు – పెద్దోడు’, ‘ఆదిత్య 369’ సినిమాలకు డైలాగ్స్ రాసిన జంధ్యాలగారితో సినిమా మాత్రం చేయించుకోలేకపోయా. ఆలోటు మోహనకృష్ణ ఇంద్రగంటితో భర్తీ చేసుకుంటున్నా. మాకు రెండు విజయవంతమైన సినిమాలు తీసిన మోహనకృష్ణతో వినోదాత్మక సినిమా చేయడం ఆనందంగా ఉంది’.
‘ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? అతని చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబిచ్చే పరిపూర్ణ హాస్యరస చిత్రంగా తెరకెక్కించాం. సెప్టెంబర్ 12 నుంచి డబ్బింగ్ ప్రారంభించి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తా’మని అన్నారు.