ఆర్ ఎక్స్ బ్యూటీ వాలైంటైన్ గిఫ్ట్ తో షాకిచ్చిందిగా..!

ఆర్ ఎక్స్ బ్యూటీ వాలైంటైన్ గిఫ్ట్ తో షాకిచ్చిందిగా..!

ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్సి మొదటి సినిమాతో అందరిని ఆకర్శించిన ముద్దుగుమ్మ పాయల్ రాజపుత్. నెగిటివ్ పాత్రలో నటించి ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగులో వరుస సినిమాలతో బిజిగా ఉంది తాజగా పాయల్ ఓ ఫోటోని షేర్ చేసింది. అందులో పాయల్ తన ప్రియుడితో ఉన్న స్టీల్ అది .. అది చుసిన అందరు షాక్ అయ్యారు.

లవర్స్ డె సందర్బంగా ప్రపంచానికి తన ప్రియుడిని పరిచయం చేయాలన్న ఆలోచనతోనే ఈ ఫోటో షేర్ చేసింది. ఇంతకీ అతడు ఎవరో తెలుసా … ముంబై లో ఓ మోడల్, పేరు సౌరబ్ డీగ్ర. గత కొత్త కాలంగా ఇతగాడితో పాయల్ డేటింగ్ లో ఉందట.

పాయల్ తన లవర్ చాలా మంచి వాడని, తనలోని లోపాలను ప్రేమించే వ్యక్తి సౌరబ్ అని గొప్పగా చెబుతుంది పాయల్. పాయల్ ఏ షూటింగ్ లో ఉన్నా కూడా అప్పుడప్పుడు షూటింగ్ కు వచ్చి వెళ్తుంటాడట. ఇప్పటికే చాలా మంది సినిమా జనాలకు తెలుసట. మరి ఈ ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్తుందా లేదా అన్నది చూడాలి.