పీఆర్సీ సాధన సమితికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉద్యమంలో అన్ని రకాల ఆందోళనలకు ఆర్టీసీ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తారని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మంచి జరుగుతుందని భావించామని.. కానీ.. ప్రభుత్వ నిర్ణయంతో విలీనం ఎందుకు తీసుకున్నామా అని ఆలోచించే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఉన్న సౌకర్యాలు కోల్పోతుంటే విలీనం ఎందుకో అర్ధం కావట్లేదని అన్నారు. రివర్స్ పీఆర్సీ వల్ల జీతాలు తగ్గే పరిస్థితి ఎదురైందని వారు వాపోయారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించలేదు కాబట్టే వారు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. 2017 నాటి ఎరియర్స్ ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించలేదు.. పైగా ఆర్టీసీ ఆదాయం మాత్రం ప్రభుత్వానికి కావాలి అని అన్నారు. ఆర్టీసీ కార్మికుల చికిత్సకు సమస్యలు ఎదుర్కొంటున్నారని మరో నేత సూర్యనారాయణ అన్నారు. తమ సమ్మెకు ప్రభుత్వ విదానమే కారణమని అన్నారు.
2323 547117Hello. I wanted to ask one thingis this a wordpress internet web site as we are planning to be shifting more than to WP. Furthermore did you make this template yourself? Thanks. 214700