దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తీ చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే రెండో షెడ్యూల్ ని పూణే లో పూర్తీ చేసిన యూనిట్ తదుపరి షెడ్యూల్ ని ఫిలింసిటీ లో ప్లాన్ చేసింది. రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కథలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి భారీ సెట్టింగ్స్ వేశారు. అందులోనే ఈ సినిమా షూటింగ్ జరపనున్నారు.
తమిళ,తెలుగు, హింది, మలయాళ, కన్నడ భాషలతో పాటు చైనా, జపాన్ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ లో హీరోయిన్స్ గా ఇప్పటికే బాలీవుడ్ భామ అలియా భట్ ఎంపికైంది. మరో హీరోయిన్ గా పరిణీతి చొప్రా ని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. డివివి ఎంటర్ టైనేమెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు అప్పుడే బిజినెస్ ఆఫర్స్ మొదలయ్యాయి. పలువురు డిస్ట్రిబ్యూటర్స్ భారీ రేట్స్ అఫర్ చేస్తున్నారట. ఇక హిందీ లో అయితే ఇప్పటికే కరణ్ జోహార్ డీల్ కూడా కుదుర్చుకున్నాడని టాక్ వినిపిస్తుంది.
రాజమౌళి – ఎన్టీఆర్ – రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది. వచ్చే ఏడాది జులై 30 2020 లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.