టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది. ఈ సినిమా ను 2020 సంవత్సరం జులై లో విడుదల చేయాలనుకున్నారు. కాని షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల వాయిదా పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వరుసగా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. సంక్రాంతి సందర్బంగా జనవరి 7న కచ్చితంగా విడుదల చేయాలని భావించిన మేకర్స్ ప్రమోషన్స్ ను కూడా చేయడం జరిగింది. ముంబయి.. కేరళ.. చెన్నై ఇలా దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్ కు ఒమిక్రాన్ అడ్డు తలిగింది.
ఒమిక్రాన్ వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. సినిమా విడుదల వాయిదా గురించి క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ఇక విడుదల ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా ను 2022 లో జులై లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా ను మొదట 2020 జులై లో అన్నారు. ఇప్పుడు 2022 జులై లో విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విడుదల విషయంలో క్లారిటీ ని ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఎప్పటికి ఇస్తుంది అనేది చూడాలి.
Here the price of a mistake is excessive to neglect many particulars in stability which
may seem too smaller and unimportant at-first sight.