జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం గురించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక నేడు చరణ్ బర్త్‌డే అవ్వడంతో ఎన్టీఆర్‌కు సంబంధించిన ఒక సర్ప్రైజింగ్ వీడియోను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. నేడు ఉదయం 10 గంటలకు అన్న వీడియో ఇంకా రాలేదు. దాంతో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చరణ్ బర్త్‌డేకు ఎన్టీఆర్ వీడియో విడుదల చేయడం జక్కన్న మార్క్ పబ్లిసిటీ స్టంట్ అంటూ అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు జక్కన్న అనుకున్న సమయంలో వీడియోను విడుదల చేయక పోవడంతో ఇది కూడా ఆయన మార్క్ ఆలస్యం అంటున్నారు. జక్కన్న చెక్కడం ఇంకా పూర్తి కాలేదా అంటున్నారు. జక్కన్న వద్ద వీడియో పెండ్డింగ్ లో ఉన్నట్లుగా రామ్ చరణ్‌కు ఎన్టీఆర్ ట్విట్టర్లో తెలియజేశాడు. అయ్యో ఆయన వద్దకు ఎలా వెళ్లింది. ఈ రోజు వచ్చేనా అంటూ చరణ్ సరదాగా కామెంట్ పెట్టాడు.
ఇక వీడియో ఆగి పోవడంకు కారణం లాక్ డౌన్ అయ్యి ఉంటుందని అంటున్నారు. ప్రతి ఒక్కరు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీరవాణి.. రాజమౌళి.. ఎన్టీఆర్‌లు ఇంట్లోంచి ఆ వీడియోను మానిటరింగ్ చేస్తూ ఉండటం వల్ల కాస్త ఆలస్యం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు వీడియో వస్తుందనే నమ్మకం మాత్రం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు.
Sorry brother @AlwaysRamCharan . I sent your gift to Jakkanna @ssrajamouli last night for his opinion. Being Rajamouli, you know how it goes. 🤦🏻♂️
Small delay..— Jr NTR (@tarak9999) March 27, 2020
177475 640769hey excellent site i will definaely come back and see once more. 518193
982378 756050This will be a fantastic site, will you be interested in doing an interview about just how you created it? If so e-mail me! 178746