Switch to English

రోశయ్య పద్దు.. తెలుగునాట అప్పటికీ ఇప్పటికీ వెరీ వెరీ స్పెషల్.!

కొణిజేటి రోశయ్య.. కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతగలిగిన అతి కొద్దిమంది నేతల్లో ఆయనా ఒకరు. సౌమ్యుడు, వివాద రహితుడు.. అదే సమయంలో మాటల్లో చతురత చాలా ఎక్కువ. ‘రవ్వంత లేని రేవంత్ రెడ్డీ..’ అని రోశయ్య సెటైరేసినా, రేవంత్ రెడ్డి లాంటోళ్ళు ఆయన్ని గౌరవ భావంతోనే చూశారు తప్ప.. ఇంకోలా ఆయన సెటైర్ల మీద ఎగిరిపడలేదు.

చాలామందికి రోశయ్య ‘అన్న’ లాంటివారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే, రోశయ్యను చాలా చాలా అమితంగా అభిమానించేవారు. గౌరవించేవారు. సంక్షేమ పథకాల కోసం నిధుల్ని వెచ్చించాల్సి వచ్చినప్పుడు, తప్పొప్పుల విషయమై రోశయ్యతో సుదీర్ఘంగా చర్చించేవారు.

సుదీర్ఘ కాలం ఆయన ఆర్థిక వ్యవహారాలు చూసుకున్నారు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో. ఎవరు ముఖ్యమంత్రిగా వున్నా, లెక్కల పద్దు విషయంలో మాత్రం రోశయ్య వైపే చూసేవారట. అంతలా లెక్కల పద్దు పక్కగా రోశయ్య తయారు చేసేవారట. తాను ఆర్థిక వ్యవహారాలు చూడకపోయినా, ఆయన వద్దకు ఆ వ్యవహారాల గురించిన ‘సలహా, సూచన’ కోసం వెళ్ళేవారట.

ఏడుసార్లు వరుసగా ఆయన ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తంగా ఆయన 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారంటే, ఆయన సామర్థ్యమేంటన్నది అర్థం చేసుకోవచ్చు. ‘బడ్జెట్ కేటాయింపుల విషయంలో అన్న రోశయ్య ఒకింత కినుక వహిస్తున్నారు.. కాస్త పెద్దమనసు చేసుకోండి..’ అని అంతర్గత సమావేశాల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్యను ఉద్దేశించి వ్యాఖ్యానించేవారు.

ఈ రోజు ఉదయం రోశయ్య తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో రోశయ్యతో తమకున్న అనుబంధాన్ని పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఆ సందర్భంగా ఆర్థిక మంత్రి హోదాలో రోశయ్య తెలుగు నేలకు అందించిన సేవల్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో...

హిందీలో అస్సలు ‘తగ్గేదే లే’ పుష్ప

ఐకాన్ స్టార్ గా టైటిల్ మార్చుకున్న అల్లు అర్జున్ నిజంగా తాను ఆ టైటిల్ కు సరిపోతానని పుష్ప ది రైజ్ తో నిరూపించుకున్నాడు. ఈ...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన దత్

రెబెల్ స్టార్ ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. దాదాపుగా 2000 కోట్లకు పైన బిజినెస్ చేయగల చిత్రాలు ప్రభాస్...

శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ పై చరణ్ ఆసక్తి

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్, ఆచార్య చిత్రాల రిలీజ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్...

సంక్రాంతి సినిమాల లిస్ట్ ఫైనల్ అయిందిగా

ఎప్పుడైతే ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ లు సంక్రాంతి రేసు నుండి పక్కకు తప్పుకున్నాయో ఇక అదే అదునుగా చాలా చిన్న చిత్రాలు సంక్రాంతి...

రాజకీయం

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు....

’13న నర్సాపురం వస్తున్నా.. ఫిబ్రవరి 5లోపు అనర్హత వేయించండి..’ రఘురామ సవాల్

ఏపీ సచివాలయ ఉద్యోగులకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు తెలిపారు. ‘ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముంది. సచివాలయ ఉద్యోగులకు నా మద్దతు తెలుపుతున్నాను. విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి...

కరోనా తీవ్రమవుతోంది.. అప్రమత్తంగా ఉండండి: పవన్ కల్యాణ్..

దేశంలో రోజురోజుకీ తీవ్రమవుతున్న కరోనా పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం...

ఫలిస్తున్న జగన్ ఢిల్లీ టూర్: ప్రత్యేక హోదా వచ్చేస్తోందా.?

కలిసొచ్చే అంశమేదన్నా వుందంటే, దానికి తమ ‘పేరు’ తగిలించేసుకోవడం అధికారంలో వున్నవారికి సర్వసాధారణమే. ఏదన్నా తేడా కొడితే మాత్రం, ‘మా ప్రయత్నం మేం చేశాం..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం కూడా మామూలే. ముఖ్యమంత్రి...

అన్నీ ఒమిక్రాన్ కేసులే.. కానీ, లెక్క నాలుగు వేలే.!

దేశంలో కోవిడ్ 19 యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు పైగానేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రోజువారీ కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న లక్షా ఎనభై వేలు. చిత్రమేంటంటే,...

ఎక్కువ చదివినవి

కోవిడ్ దృష్ట్యా.. తిరుమలలో నిబంధనలు కఠినతరం: టీటీడీ చైర్మన్

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని.. కట్టుదిట్టమైన...

ఏపీ సర్కారు సంక్రాంతి దోపిడీ: సామాన్యుల్ని ఉద్ధరించడానికే.!

పండగ పేరు చెప్పి ప్రయాణీకుల్ని దోచేయడాన్ని ఏ తరహా ‘జనోద్ధరణ పథకం’ అనుకోవాలి.? సంక్షేమ పథకాల పేరుతో వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెడుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వైఎస్...

రాశి ఫలాలు: బుధవారం 05 జనవరి 2022

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం సూర్యోదయం: ఉ 6:36 సూర్యాస్తమయం : సా‌.5:35 తిథి: పుష్య శుద్ధ తదియ సా.6:36నిమిషాల వరకు తదుపరి పుష్య శుద్ధ చవితి సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము :...

‘కనీసం ప్రాణాలతో వచ్చాను..’ పంజాబ్ సీఎంపై ప్రధాని మోదీ అసహనం..!

పంజాబ్ రాష్ట్రంలో తనకు ఎదురైన చేదు అనుభవంపై ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చండీఘడ్ లోని భఠిండా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి...

జాతీయగీత ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది.

ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు, ఇంట‌ర్నెట్ విరివిగా వాడుతున్న కాలంలో విద్యార్థులు, యువ‌త వాటికే స‌మ‌యాన్ని వెచ్చిస్తున్నారు కానీ ఎంతో క‌ష్ట‌ప‌డి స్వాతంత్య్రం తెచ్చిన మ‌హా యోధుల గురించి, దేశ‌మంతా ఒక‌టే అని...