ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తన మంత్రివర్గంలో 25 కొత్త మంత్రులను ఎంపిక చేసి వారితో ప్రమాణ స్వీకారం చేయించాడు. అయితే ఈ లిస్ట్ లో రోజా పేరు లేకపోవడం అందరికి షాక్ ఇస్తుంది. వై ఎస్ జగన్ పార్టీ తరపున ఓ రేంజ్ లో ప్రచారం చేసిన రోజాకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా రెండో సారి రోజాకు అవకాశం ఇస్తారేమో అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం రోజా కాస్త గుస్సామీద ఉన్నట్టు చెబుతున్నారు. రోజాతో పాటు జగన్ కష్టకాలంలో తోడున్న కొందరు సీనియర్స్ కు కూడా అయన తన కాబినెట్ లో చోటివ్వలేదు.
మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత రోజాకు జగన్ ఫోన్ చేసి విజయవాడలో అందుబాటులో ఉండాలని చెప్పాడట. అయినా సరే రోజా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయిందట. ఈ నేపథ్యంలో రోజాను బుజ్జగించే పనిలో ఉన్నాడట జగన్. తాజాగా ఆయన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. లేదంటే .. ఏ పీఎస్ ఆర్టీసీ చైర్మన్ గాను నియమించే అవకాశాలు ఉన్నాయట. తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్.
మొత్తానికి మంత్రిగా కాకుండా చైర్ పర్సన్ పదవిలో రోజాకు ముఖ్యమైన పదవే దక్కే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబందించిన సాద్య సాధ్యాలను పరిశీలించి .. ప్రకటించే అవకాశం ఉంది.
Related Posts
జగన్ ‘రెండున్నర’ ఫార్ములా.. నవ్వుల పాలవుతున్న వేళ