అన్‌స్టాపబుల్ టాక్ షోకి వెళ్ళాలనే ‘కోరిక’ బలంగా వున్నట్టుంది మంత్రి రోజాలో.! కానీ, ఆమెకు ఆ ‘అన్‌స్టాపబుల్’ టాక్ సో నిర్వాహకుల నుంచి పిలుపు రావడంలేదు. బాలయ్య తలరచుకుంటే ఎంత సేపు.? ఈరోజు అనుకుంటే, రేపు రోజాతో అన్‌స్టాపబుల్ షూటింగ్ జరిగిపోతుంది. కానీ, అలా జరగడంలేదు.
కారణం ఏమై వుంటుందబ్బా.? రోజా కేవలం రాజకీయ నాయకురాలే కాదు, సినీ నటి కూడా. పైగా, బాలకృష్ణతోనూ చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో పలు సూపర్ హిట్ సినిమాలూ వున్నాయ్. రాజకీయాలెలా వున్నా, బాలకృష్ణకి రోజా అత్యంత సన్నిహితురాలు.
రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆ కోణంలో రోజా, అప్పటికప్పుడు తడుముకోకుండా విమర్శలు చేసేస్తారుగానీ, బాలయ్య కనిపిస్తే చాలు.. ఆయన మీద వల్లమాలిన అభిమానాన్ని కురిపించేస్తారు. బాలయ్యతో సెల్ఫీ కోసం రోజా ఎగబడతారు. అసెంబ్లీలో ఓ వైపు ఇరు పక్షాల మధ్యా హీట్ వేవ్ కొనసాగుతున్న సమయంలోనూ, లాబీల్లో బాలయ్యతో సరదాగా సెల్ఫీ దిగి అప్పట్లో హాట్ టాపిక్ అయ్యారు రోజా.
మరి, బాలయ్యతో ఇంత చనువుగా వుండే రోజా, అన్‌స్టాపబుల్ వేదికపై ఎందుకు కనిపించలేదబ్బా.? కారణం ఏమై వుంటుందోగానీ, దీన్ని ఆమె ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నట్టున్నారు.
‘జగన్ గారు ఏమైనా అనుకుంటారేమోనని నేను వెళ్ళలేదు.. ఎవరైనా చాడీలు చెప్పినా చెబుతారు.. అవి నమ్మి, జగన్ నన్ను అపార్థం చేసుకుంటారేమో..’ అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో అన్‌స్టాపబుల్‌కి వెళ్ళడంపై రోజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడేమో, ‘పిలిచినా వెళ్ళను..’ అంటున్నారు. అంటే, అట్నుంచి పిలుపు రాదని రోజా ఫిక్సయిపోయారన్నమాట.
430398 340205I adore your wordpress web template, wherever would you download it from? 427073
703077 667796Wonderful post nevertheless , I was wanting to know in the event you could write a litte a lot more on this topic? Id be really thankful should you could elaborate just a little bit further. Bless you! 587914
362700 810151You could uncover two to three new levels inside L . a . Weight loss and any 1 someone is extremely critical. Initial stage might be real melting away rrn the body. lose weight 439557
796442 27772Sweet internet site , super layout, truly clean and utilize genial . 497131