Switch to English

ఫాఫం మంత్రి రోజా.! సమర్థించుకోలేక టాలీవుడ్‌పై దుష్ప్రచారమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

తెలుగు సినిమాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు షూటింగులు జరుపుకోవడంలేదంటూ సినీ నటి, వైసీపీ నేత, మంత్రి రోజా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. తమిళ దర్శకుడు సెల్వమణి తమిళ సినిమా షూటింగులు తమిళనాడులోనే జరగాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన దరిమిలా, ఈ వ్యవహారం రోజా మెడకు చుట్టుకుంది.

తన భర్త వ్యాఖ్యల్లో తప్పేముందంటూ ఆ వ్యాఖ్యల్ని సమర్థించుకోవడానికి రోజా నానా తంటాలూ పడ్డారు. నిజానికి, ఆంధ్ర్రప్రదేశ్ అలాగే తెలంగాణ.. రెండు వేర్వేరు రాష్ట్రాలు. తెలుగు సినిమా స్థిరపడింది తెలంగాణలోని హైద్రాబాద్‌లో. ఆ లెక్కన తెలుగు సినిమాల షూటింగులు ఆంధ్రప్రదేశ్‌లో జరగకూడదు.. ఇది సెల్వమణి సిద్ధాంతాన్ని అన్వయిస్తే అర్థమయ్యే విషయం.

కానీ, సినిమా అనేది క్రియేటివ్ ప్రపంచం. ఓ దర్శకుడు తన కథకు అనుగుణంగా లొకేషన్స్ ఫిక్స్ చేసుకుంటాడు. ఆంధ్రా, అమెరికా అన్న తేడాలుండవు.. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళి సినిమా షూటింగ్ చేసుకొస్తారు. కానీ, ఫలానా చోట షూటింగ్ చేయాలని డిమాండ్ చేయడం రాజకీయం కాక మరేమిటి.?

‘పుష్ప’, ‘ఆచార్య’ సినిమాలు ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో షూటింగులు జరుపుకున్నాయి. బాలకృష్ణ నటించిన పలు సినిమాలూ ఏపీలో షూటింగులు జరుపుకున్నాయి. గోదావరి నేపథ్యంలో ఎన్ని సినిమాలొచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ వస్తోంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగులు చేయాలనడం హాస్యాస్పదం. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ సినిమాకి దేశమంతా రెవెన్యూ వచ్చింది.. అలాగని ఫలానా చోట ఆ సినిమా షూటింగ్ చేయాలని ఏ రాష్ట్రమైనా డిమాండ్ చేయగలదా.?

రోజా ఎన్నో సినిమాల్లో నటించారు, నిర్మాతగానూ వ్యవహరించారు.. మరి, అప్పుడెందుకు ఆమె ప్రాంతీయ భావజాలం చూపలేకపోయారు.? జబర్దస్త్ కామెడీ షో హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుందిగానీ, ఆంధ్రప్రదేశ్‌లో కాదు కదా.?

5 COMMENTS

  1. 237863 715351Your writing is fine and gives food for thought. I hope that Ill have far more time to read your articles . Regards. I wish you which you frequently publish new texts and invite you to greet me 694737

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...