టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “రాబిన్ హుడ్”. శ్రీ లీల హీరోయిన్. గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలవల్ల వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. మార్చి 28న “రాబిన్ హుడ్” విడుదల కానున్నట్లు ప్రకటించారు.
గతంలో నితిన్- వెంకీ కాంబినేషన్లో “భీష్మ” మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా హిట్ టాక్ అందుకుంది. దీంతో “రాబిన్ హుడ్” పై అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ తెరకెక్కిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక మార్చి 28 నే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “హరిహర వీరమల్లు” విడుదల కానుండటం గమనార్హం.