నితిన్ హీరోగా వచ్చిన రాబిన్ హుడ్ ఓటీటీలో దూసుకుపోతోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మే10 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైనప్పటి నుంచి ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతోంది. అటు యాక్షన్ తో పాటు ఇటు ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉండటంతో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోందని మూవీ టీమ్ చెబుతోంది. రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూవీకి ఓటీటీలో ఏకంగా 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ వచ్చాయని జీ5 అధికారికంగా ప్రకటించింది. ఈ దూకుడు ఇంకా కంటిన్యూ అవుతోందని తెలిపింది సంస్థ.
అనాథగా పుట్టి పెరిగిన రామ్.. ఆ తర్వాత రాబిన్ హుడ్ గా మారి ధనవంతుల నుంచి డబ్బులను దొంగిలిస్తూ పేదలకు పంచిపెడుతుంటాడు. ఆ తర్వాత అనుకోకుండా డ్రగ్స్ మాఫియాతో గొడవపడటంతో రామ్ లైఫ్ మారిపోతుంది. అక్కడి నుంచి రామ్ ఎదుర్కున్న ఉత్కంఠ ఘటనల ఆధారంగా మూవీ సాగుతుంది. ఇందులో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా చేసింది. అటు మాస్ ఆడియెన్స్ తో పాటు ఇటు క్లాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో ఇది ఓటీటీలో సక్సెస్ అయిందంటూ మూవీ టీమ్ చెబుతోంది. ప్రస్తుతం ZEE5లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు జీవి ప్రకాశ్ సంగీతం అందించారు.
