ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు కూర్చుని చర్చించుకుంటున్నా, రాష్ట్రంలో రోడ్ల గురించిన ప్రస్తావనే వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు శరవేగంగా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వ హయాంలో. కొత్త రోడ్ల నిర్మాణం, ఇప్పటికే వున్న రోడ్ల మరమ్మత్తులు.. వెరసి, ప్రయాణం సాఫీగా సాగుతోందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.
మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, గిరిజనం కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేలా మారుతున్నాయి. మారడమేంటి.? అసలంటూ అక్కడ అంతకుముందు రోడ్లు వుంటే కదా.? స్వాతంత్ర్యం సిద్ధించాక, కొన్ని ప్రాంతాల్లో అసలు రోడ్లే లేవు.. కూటమి అధికారంలోకి రావడానికి ముందు. అలాంటి ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన రోడ్లను నిర్మించింది కూటమి ప్రభుత్వం.
రోడ్లు మాత్రమే కాదు, అసలంటూ కరెంటు ప్రస్తావన లేకుండా పోయిన గిరిజన ప్రాంతాల్లో కరెంటు వెలుగులు కనిపిస్తున్నాయి. గడచిన ఏడు నెలల్లో అభివృద్ధి అంటే ఏంటో కూటమి ప్రభుత్వం చూపిస్తోంది. కేవలం రోడ్లే అభివృద్ధా.? అంటే, అభివృద్ధికి రహదారులే ముఖ్యం కదా మరి.!. కేంద్రం నుంచి వస్తున్న నిధుల్ని సద్వినియోగం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, అభివృద్ధి అంటే రహదారులు సక్రమంగా వుండడం వల్లే జరుగుతుందని నమ్మే వ్యక్తి.
గతంలో, అంటే వైసీపీ కంటే ముందు అధికారంలో వున్న జగన్ అప్పట్లో రోడ్ల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. వైసీపీ హయాంలో ఆ రోడ్లు నాశనమయ్యాయి. కనీసం రోడ్ల మీద గుంతల్ని పూడ్చేందుకు కూడా శ్రద్ధ పెట్టలేకపోయింది వైసీపీ. ఆ కాలంలో రోడ్ల మీద ప్రయాణమంటే నరకయాతన.. అనే భావన కలిగేది రాష్ట్ర ప్రజలకి.
ఇదిలా వుంటే, ప్రభుత్వం రోడ్ల మీద చేస్తున్న ఖర్చు, ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోంది, వారికి సుఖవంతమైన ప్రయాణాన్నీ అందిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ కష్టం ప్రజలకు కనిపిస్తోంది.