Switch to English

షాదీ ముబారక్ మూవీ రివ్యూ – టైటిల్ లో ఉన్న ఫీల్ సినిమాలో కూడా ఉండాల్సింది.

Critic Rating
( 2.00 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow
Movie షాదీ ముబారక్
Star Cast ఆర్.కె సాగర్, దృశ్య రఘునాథ్
Director పద్మశ్రీ
Producer శిరీష్ - లక్ష్మణ్
Music సునీల్ కశ్యప్
Run Time 2 గంటల 16 నిమిషాలు
Release మార్చ్ 5, 2021

బుల్లితెరపై ‘మొగలి రేకులు’ సీరియల్ తో బాగా ఫేమస్ అయిన ఆర్.కె సాగర్ ఆ తర్వాత వెండితెరపై హీరోగా తన అదృష్టం పరీక్షించుకున్నా ఆశించిన ఫలితం రాలేదు. ఈ సారి కాస్త గ్యాప్ తీసుకుని దిల్ రాజు లాంటి బ్యానర్ సపోర్ట్ తో చేసిన సినిమా ‘షాదీ ముబారక్’. సింపుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఎంతవరకూ మెప్పించిందో చూద్దాం..

కథ:

ఆస్ట్రేలియా నుంచి పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చిన కుర్రాడు మన సున్నిపెంట మాధవ్(ఆర్.కె సాగర్). ఓ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఒకే రోజు మూడు డిఫరెంట్ పెళ్లి చూపులకు వెళ్ళడానికి ఫిక్స్ అవుతాడు. అనుకోని కారణం వల్ల మాధవ్ ని పెళ్లి చూపులకి తీసుకెళ్ళడానికి మ్యారేజ్ బ్యూరో తరపున ఓనర్ కూతురు తుపాకుల సత్యభామ(దృశ్య రఘునాథ్) వస్తుంది. అలా మొదలైన ఆ జర్నీలో మొదట్లో మాధవ్ కి – సత్య భామకి పెద్దగా పడకపోయినా, కాసేపటికి ఇద్దరూ క్లోజ్ అవుతారు. అంతే కాకుండా సత్య భామ మాధవ్ తో ప్రేమలో కూడా పడుతుంది. కానీ అదే టైంకి మాధవ్ మూడో పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయితో పెళ్ళికి ఓకే అనడంతో సత్యభామకి కోపం వస్తుంది. అలా మాధవ్ మీద కోపంతో తను కూడా ఇంట్లో చూసిన పెళ్లి సంబంధానికి ఓకే అంటుంది. ఇక అక్కడి నుంచీ వారి మధ్య జరిగిన పరిస్థితులేంటి? మాధవ్ కూడా సత్య భామని ఇష్టపడ్డా ఎందుకు వేరే అమ్మాయితో పెళ్ళికి ఒప్పుకున్నాడు? మాధవ్ మీద కోపం పెంచుకున్న సత్యభామ చివరికైనా తన ప్రేమని మాధవ్ కి చెప్పిందా? లేదా? చివరికి వీళ్ళిద్దరూ కలిసారా? లేక విడిపోయారా? అన్నదే కథ.

తెరమీద స్టార్స్..

ముందుగా హీరో ఆర్.కె సాగర్ విషయానికి వస్తే.. చూడటానికి స్టైల్ అండ్ క్లాసీ లుక్ లో ఆకట్టుకుంటాడు. అలాగే సింపుల్ అండ్ సెటిల్డ్ కుర్రాడి పాత్రలో హావభావాలు బాగా పలికించాడు. ఎమోషనల్ సీన్స్ లో ఓకే అనిపించినా ఇంకా బెటర్ గా చేసి ఉండచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. హీరోయిన్ దృశ్య రఘునాథ్, అల్లరి, పొగరు కలగలిపిన సత్యభామ పాత్రలో బాగా చేసింది. దృశ్య కూడా ఎమోషనల్ ఫీల్ ని సరిగా రీచ్ చెయ్యడంలో వెనకపడిందనే చెప్పాలి. ఇకపోతే కమెడియన్స్ రాహుల్ రామ కృష్ణ, భద్రం, ఆర్.జె హేమంత్ లు అక్కడక్కడా తమ పాత్రలతో నవ్విస్తారు. ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే అజయ్ ఘోష్ సీన్ సీన్ నవ్విస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల్లో ఓకే అనిపించారు.

తెర వెనుక టాలెంట్..

కథ దగ్గర నుంచే సినిమా మొదలవుతుంది కాబట్టి అక్కడి నుంచే మొదలు పెడితే.. ఇద్దరి మధ్య అసలు విషయం తెలియకుండా అపార్ధం చేసుకొని విడిపోయి మళ్ళీ కలుసుకునే ప్రేమకథలు తెలుగు ప్రేక్షకులు ఎన్ని చూసుంటారో మేము ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కావున కథలో కొత్తదనం అయితే లేదు కానీ కథనంలో ఆసక్తిని క్రియేట్ చెయ్యాలని మ్యారేజ్ అనే బ్యాక్ డ్రాప్ లో పాయింట్ చెప్పాలనుకోవడం బాగుంది. కానీ దాని కోసం రాసుకున్న సీన్స్ అన్నీ చాలా సినిమాల్లో చూసేసినవే కావడం ఇక్కడ బోర్ కొట్టించే అంశం. అక్కడక్కడా నవ్వు తెప్పించే ప్రతి సీన్ మనం ఇప్పటికే చాలా సార్లు చూసేసాం. కావున కథలో ఎక్కడా ఆసక్తి కలగదు, అన్నీ ఆడియన్స్ ఊహించనవే జరుగుతూ ఉండడంతో సినిమా సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ ని కలిగిస్తుంది. కామెడీ వన్ లైనర్ డైలాగ్స్ అక్కడక్కడా బాగున్నాయి, కానీ ఎమోషనల్ డైలాగ్స్ కి స్కోప్ ఉన్నా పెద్దగా రాయకపోవడం మైనస్. ఇలాంటి ప్రేమ కథలకి డైరెక్టర్ పద్మశ్రీ బాగా వర్కౌట్ చేయాల్సిన పాయింట్ ఎమోషన్.. అదే మిస్ అయ్యింది. హీరో – హీరోయిన్ ప్రేమలో పడడానికి బలమైన ఎమోషన్ ఉండదు, అలాగే సెకండాఫ్ లో అన్ని పాత్రలని మార్చడానికి రాసుకున్న ఎమోషనల్ సీన్స్ మరియు ముఖ్యంగా క్లైమాక్స్ మరీ పేలవంగా ఉన్నాయి. ఈ కథకి అవసరమైన ఎమోషన్స్ ని చాలా లైటర్ నోట్ లో చెప్పడం వలన సెకండాఫ్ బాగా డల్ అయిపోయిందనిపిస్తుంది.

టెక్నికల్ డిపార్ట్మెంట్ లో హైలైట్ గా నిలిచింది అంటే శ్రీకాంత్ నరోజ్ విజువల్స్ మరియు సునీల్ కశ్యప్ మ్యూజిక్. శ్రీకాంత్ విజువల్స్ లో లవ్లీ ఫీల్ తెలుస్తుంది, ఆ విజువల్స్ కి తగ్గట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ప్రతి సన్నివేశంలో మిస్ అయిన ఎమోషన్స్ ని మ్యూజిక్ లో తీసుకురావడానికి తెగ కష్టపడ్డాడు అని చెప్పాలి. మధు ఎడిటింగ్ ఇంకాస్త స్పీడ్ గా, బెటర్ గా ఉండాల్సింది. నాని ఆర్ట్ వర్క్ డీసెంట్ గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– ఆర్.కె సాగర్ పెర్ఫార్మన్స్
– ఫస్ట్ హాఫ్ లోని కొన్ని కామెడీ సీన్స్
– శ్రీకాంత్ విజువల్స్
– సునీల్ కశ్యప్ మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– ఎన్నో సార్లు చూసేసిన కథ
– కథనంలో ఆసక్తి లేకపోవడం
– నేరేషన్ స్లోగా సాగడం
– లవ్ ట్రాక్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో కనెక్ట్ అవ్వలేకపోవడం
– కొత్తదనం లేని సీన్స్
– వీక్ క్లైమాక్స్

విశ్లేషణ:

షాదీ ముబారక్ – టైటిల్ లో ఉన్న సెలబ్రేషన్ ఫీలింగ్ సినిమాలో కూడా ఉండి ఉంటే బాగుండేది. సింపుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని ప్రమోట్ చేశారు. ఎంటర్ టైనింగ్ పరంగా చాలా సార్లు చూసేసిన కామెడీనే అయినా కాస్త అటు ఇటుగా ఓకే అనచ్చు కానీ కీలకమైన సెకండాఫ్ మరియు ఎమోషనల్ సీన్స్ పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో 136 నిమిషాలు ఈ సినిమాని భరించడం కష్టమే సుమీ అనే ఫీలింగ్ వస్తుంది.

చూడాలా? వద్దా?: ఆర్.కె సాగర్ కి భీభత్సమైన అభిమాని అయితే ట్రై చేయచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 2/5 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...