ఏపీలోని ఓ ల్యాండ్ మాఫియా కేసులో బుల్లితెర నటి రీతూ చౌదరి పేరు మార్మోగుతోంది. రూ. 700 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టిన స్కామ్ లో ఆమె భర్త చీమకుర్తి శ్రీకాంత్, రీతూ పేర్లు కూడా ఉండటమే ఇందుకు కారణం. అసలు ఆమెకు పెళ్లైన విషయం ఈ వ్యవహారం వల్లే చాలా మందికి తెలిసింది.
ఇక ఈ కేసు విచారణను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై రీతూ స్పందించింది.
చీమకుర్తి శ్రీకాంత్ ను నమ్మి మోసపోయినట్లు వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి కొన్ని విషయాలు బయట పెట్టింది. శ్రీకాంత్ తో వివాహమైనట్లు, కొద్ది రోజులు కలిసి ఉన్నట్లు తెలిపింది. తన భర్తతో సన్నిహితంగా ఉన్న రోజుల్లో కొన్ని పేపర్లపై అతడు సంతకాలు తీసుకున్నట్టు తెలిపింది. అతడిని గుడ్డిగా నమ్మి మోసపోయానని చెప్పింది.
ఇదంతా ఏడాదిన్నర క్రితం జరిగిందని, అప్పుడు అతని అసలు స్వరూపం బయటపడటంతో ప్రస్తుతం దూరంగా ఉన్నట్లు తెలిపింది. శ్రీకాంత్, తన తండ్రి పేరిట 45 రిజిస్ట్రేషన్లు ఉండగా.. అందులో రెండు చోట్ల ఫ్లాట్లకు సంబంధించి పవర్ ఆఫ్ అటార్నీ రీతు పేరిట చేసినట్లు పేర్కొంది. ఈ స్కామ్ తో తనకి ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా తనని ఈ కేసులోకి లాగొద్దని వ్యాఖ్యానించింది.