బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నిజంగా ప్రేక్షకులను కుర్చీ అంచులకు చేర్చే షాక్ ఇచ్చింది. అందరి ఊహలకు పూర్తిగా విరుద్ధంగా, యాంకర్‌గా మంచి క్రేజ్ సంపాదించిన రీతూ చౌదరి ఎలిమినేట్ కావడం హౌజ్‌లోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చగా మారింది. నిన్న వరకూ డేంజర్ జోన్‌లో సుమన్ శెట్టి లేదా సంజన వెళ్లే అవకాశాలు ఎక్కువగా ప్రచారం అవుతుండగా, చివరి క్షణంలో రీతూ పేరు అనౌన్స్ కావడంతో అన్ని అంచనాలు తారుమారయ్యాయి.
డిసెంబర్ 6న షూట్ ముగిసిన ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను ఇవాళ టెలికాస్ట్ చేయనున్నారు. అయితే అ హౌజ్‌లోని కంటెస్టెంట్స్ కూడా ఈ నిర్ణయంతో షాక్ అయ్యారని సమాచారం. తనూజ, డిమాన్ సేఫ్‌జోన్‌లో ఉండగా, భరణి, సుమన్, సంజన, రీతూ మధ్య అసలు పోటీ ఉద్రిక్తంగా సాగింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రీతూ గేమ్‌కు ఎండ్ కార్డు పడింది.
బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు రీతూ భారీ పారితోషికం అందుకున్నట్టు టాక్ నడుస్తోంది. రోజుకు ₹40వేల వరకు ఆమె రెమ్యూనరేషన్ అని ఒక లెక్క వినిపిస్తుండగా, వారానికి ₹2.75 లక్షల నుంచి ₹3.5 లక్షల మధ్య వారం చెల్లింపులు జరిగాయని మరో లెక్క ప్రచారంలో ఉంది. దాంతో 13 వారాల ప్రయాణంలో రీతూ ₹35.75 లక్షల నుంచి ₹45.5 లక్షల వరకు సంపాదించినట్టు అంచనా. ఇదే నిజమైతే, ఈ సీజన్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకున్న కంటెస్టెంట్‌గా రీతూ నిలిచే అవకాశం ఉంది.
ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్ బిగ్ బాస్ హౌజ్ గేమ్‌ను పూర్తిగా మార్చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీతూ వెళ్లిపోవడం తర్వాత గేమ్ డైనమిక్స్ ఎలా మారతాయి? ఎవరు స్ట్రాంగ్‌గా ముందుకు వస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది.
