Rishab Shetty: ‘పెద్ది’ ట్రైలర్ కు రిషబ్ శెట్టి ఫిదా..! ఏమన్నారంటే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,220FansLike
57,764FollowersFollow

Rishab Shetty: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సందడి మొదలైంది. నిన్న విడుదలైన ట్రైలర్ కు భారీ స్పందన లభించింది. ట్రైలర్ కట్ లో రామ్ చరణ్ చూపిన బాడీ ట్రాన్స్ ఫర్మేషన్, హై ఇన్టెన్సిటీ యాక్షన్, స్పోర్ట్స్ యాంగర్ కి ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు ముగ్దులైపోయారు. ప్రతి ఫ్రేమ్ లో దర్శకుడిగా బుచ్చిబాబు చూపిన వైవిధ్యనికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా క్రాస్ ఓవర్ అథ్లెట్ అనే కాన్సెప్ట్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు. సినిమాలో ఇంకెంత బలమైన కంటెంట్ ఉంటుందోననే చర్చ నడుస్తోంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సైతం ‘పెద్ది’ ట్రైలర్ చూసి థ్రిల్ ఫీలయ్యారు. సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

‘పెద్ది ట్రైలర్ చూశాను. కన్నులపండుగగా ఉంది. ప్రతి ఫ్రేమ్ లో రామ్ చరణ్ కష్టం కనిపించింది. పాత్రోచితంగా ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం. సినిమా మొత్తం రిచ్ నెస్ కనపడింది. ట్రైలర్ లో శివరాజ్ కుమార్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. పాత్రలో హుందాతనం కనపడింది. జాన్వీ కపూర్ అందం సినిమాకు ఎంతో గ్లామర్ తీసుకొచ్చింది. సినిమాను దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన విధానం, ఆయన కష్టం ట్రైలర్ లో కనిపిస్తోంది. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షల’ని అన్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెద్ది సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 3న సాయంత్రం 6గంటలకు, రాత్రి 9గంటలకు రెండు ప్రీమియర్లతో సినిమా సందడి ప్రారంభం కానుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రమోషన్లు వరుసగా జరుగనున్నాయి. ఇందుకు ప్రారంభంగా ముంబయిలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈనెల 23న భోపాల్ ఏ.ఆర్.రెహమాన్ కాన్సెర్ట్ తో భారీ వేడుక నిర్వహించనున్నారు.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

ఎక్కువ చదివినవి

OG2లో పవన్ కళ్యాణ్‌కు జోడీగా పూజా హెగ్డే? హీరోయిన్ వేటలో సుజీత్!

ఇటీవల విడుదలైన OG2 పోస్టర్ అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచింది. సినిమా పనులు అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దర్శకుడు సుజీత్ ప్రస్తుతం...

ప్రశ్న రావణ్ అరెస్టుపై ప్రకాశ్ రాజ్ స్పందన.. చంద్రబాబు, పవన్‌కు బహిరంగ ప్రశ్నలు

యూట్యూబ్ ఛానల్ ప్రశ్నకు చెందిన జర్నలిస్టులు కేవీఆర్, రావణ్ అరెస్టుల వ్యవహారంపై నటుడు Prakash Raj స్పందించారు. ఈ అంశంపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu,...

శ్రీలీల హిందీ సినిమాకు బ్రేకులు.. రిలీజ్ ఎప్పుడో ఇంకా క్లారిటీ లేదు

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా కనిపించిన శ్రీలీలకు ఇటీవల కొత్త ప్రాజెక్టులు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ హీరోగా, దర్శకుడు అనురాగ్ బసు...

DAILY HOROSCOPE: కన్య రాశికి ఉద్యోగ అవకాశాలు.. ధనుస్సు రాశికి ప్రయాణాల్లో శుభవార్తలు

జులై 5 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈరోజు చంద్ర మాన పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దైనందిన జీవితానికి మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు ప్లాన్

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో...