ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినాయకుడి నవరాత్రోత్సవాల హంగామా కొనసాగుతోంది. నవరాత్రులు పూర్తవడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా నిమజ్జనాలే కనిపిస్తున్నాయి. అయితే నిమజ్జనం అంటే మామూలు హంగామా ఉండదు కదా. ఈ హంగామాలో లడ్డూ వేలం పాటలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో లడ్డూ వేలం పాట అనగానే అందరికీ టక్కున బాలాపూర్ లడ్డూ వేలం పాటనే గుర్తుకు వస్తుంది. దానికి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం బాలాపూర్ ను మించి వేలం పాటలు కూడా కొనసాగుతున్నాయి.
ఇప్పుడు తాజాగా బండ్లగూడలోని జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండే కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లోని వినాయకుడి లడ్డూ రికార్డు ధర పలికింది. ఏకంగా రూ.1.87 కోట్లు ధర పలికింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద మొత్తంలో ధర పలకడం అంటే ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఇదే కీర్తి రిచ్ మండ్ విల్లాస్ వినాయకుడి లడ్డూ గతేడాది కూడా రూ.1.20 కోట్ల ధర పలికింది. ఈ సారి గతేడాదిని మించి ధర పలికింది. ఇక్కడి లడ్డూను కొనుగోలు చేస్తున్న వారికి పెద్ద మొత్తంలో లాభాలు కలుగుతుందనే ప్రచారం ఉండటంతో ఇంతగా ధర పలికింది.
అయితే కీర్తి రిచ్ మండ్ లో ఎక్కువగా ధనవంతులే ఉంటారు కాబట్టి.. ఇంత ధర పలికిందని అంటున్నారు. ఏదేమైనా ఇంత పెద్ద మొత్తంలో ధర పలకడం అంటే మాటలు కాదంటున్నారు. లడ్డూలకు ఇంత పెద్ద మొత్తంలో పెడుతున్నారంటే.. వారికి ఇంక ఏ స్థాయిలో లాభం జరుగుతుందో అనే ప్రచారం కూడా ఉంది. ‘