కొండా సురేఖ వివాదంపై ఆర్జీవీ ఇప్పట్లో సైలెంట్ అయ్యేలా కనిపించట్లేదు. నాగార్జునను అమితంతా ఇష్టపడే వారిలో ఆర్జీవీ కూడా ఉంటారు. తనకు కెరీర్ ను ప్రసాదించింది నాగార్జుననే అని అనేక సార్లు స్టేజిల మీదనే చెప్పారు ఆర్జీవీ. అందుకే కాబోలు నాగార్జునను ఎవరేం అన్నా సరే అంత సీరియస్ గా రియాక్ట్ అవుతుంటారు ఆర్జీవీ. మొన్న నాగార్జున, నాగచైతన్య, సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసినపై ఆర్జీవీ అప్పుడే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇక తాజాగా మరో ట్వీట్ కూడా చేశారు ఆర్జీవీ. ఆయన ట్వీట్ లో ఇలా రాసుకొచ్చారు.
కొండా సురేఖ గురిపెట్టింది కేటీఆర్ ను.. కాల్చింది నాగార్జున ఫ్యామిలీని, కానీ సారీ చెప్పింది మాత్రం సమంతకు. ఐన్ స్టీన్ కూడా ఈ ఈక్వెషన్ ను సరిచేయలేడేమో అంటూ ఆయన సెటైర్లు వేశారు. దాంతో ఈ ట్వీట్ కాస్త వైరల్అవుతోంది. ఇక కొండా సురేఖపై ఇప్పటికే నాగార్జున పరువు నష్టం దావా కేసు కూడా పెట్టారు. న్యాయపరంగానే పోరాడుతానంటూ తెలిపారు హీరో నాగార్జున. నాగార్జున, చైతన్యలపై కొండా సురేఖ చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వ్యాఖ్యలపై సురేఖ సారీ కూడా చెప్పింది.
అయినా సరే ఆర్జీవీ మాత్రం వదలట్లేదు. అయితే ఇదే కొండా సురేఖ, ఆమె భర్త మురళి జీవితంపై గతంలో ఆర్జీవీ ఓ సినిమా కూడా తీశారు. దాని ఫలితం పక్కన పెడితే.. ఇప్పుడు అదే కొండా సురేఖపై ఆర్జీవీ సెటైర్లు వేస్తూ ట్వీట్లు చేయడం సంచలనంగా మారుతోందనే చెప్పుకోవాలి.