ఎందుకు దాక్కుంటున్నావ్.? అంటే, నేనేమీ దాక్కోవడం లేదు.. అంటాడు రామ్ గోపాల్ వర్మ.! ఓ న్యూస్ ఛానల్‌లో వర్మ తాజాగా దర్శనమిచ్చాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. మీడియాకి సామాజిక బాధ్యత వుంటే, పోలీసులు వెతుకుతున్న వ్యక్తిని స్టూడియోలో కూర్చోబెట్టదు.
సరే, ఆర్జీవీ అరెస్టవుతాడా.? అరెస్టయితే బెయిల్ మీద విడుదలయ్యే ఛాన్స్ ఎంత.? అసలు మార్ఫింగ్ కేసులో వర్మకి పడే శిక్ష ఎంత.? ఇదంతా వేరే చర్చ.
వర్మ, మార్ఫింగ్ ఫొటోలతోపాటు వీడియోల్ని కూడా సోషల్ మీడియా వేదికగా పోల్చాడు. వైసీపీ హయాంలో, వైసీపీ ఇచ్చిన ప్యాకేజీలకు కక్కుర్తి పడి వర్మ చేసిన దుశ్చర్య అది. పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీదా, లోకేష్ మీదా.. అత్యంత జుగుప్సాకరమైన రీతిలో మార్ఫింగులు చేశాడు ఆర్జీవీ.
అయితే, అసలు తానెప్పుడూ అలా చేయలేదంటూ తాజాగా ఓ న్యూస్ ఛానల్‌లో మాట్లాడుతూ చెప్పాడు ఆర్జీవీ. ఔనా.? అయితే, ఇవేంటి.? అంటూ ఆర్జీవీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల గురించి ఆధారాలు చూపించాడు సదరు ఛానల్ జర్నలిస్టు.
ఇదంతా ఓ పబ్లిసిటీ స్టంట్. ముందే చెప్పుకున్నట్టు, పోలీసులు వెతుకుతున్న వ్యక్తిని, స్టూడియోలో కూర్చోబెట్టడమే తప్పు. ఆపై, అతన్ని కడిగి పారేస్తున్నట్లు న్యూస్ ఛానల్ ఇచ్చిన బిల్డప్ ఒకటి.
అన్నట్టు, మార్ఫింగ్ ఫొటోలు అలాగే వీడియోలు పోస్ట్ చేయడం అనేది రాజ్యాంగం తనకు కల్పించిన హక్కు.. అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. అది హక్కు అయితే, భయపడటమెందుకు.? పోలీసు విచారణకు హాజరవ్వొచ్చు కదా.?
అడ్డంగా బుక్కయిపోయి కూడా, బుకాయింపులకు దిగడంలో ఆర్జీవీకి సాటి ఇంకెవ్వరూ రారు. అసలంటూ ఈ మార్ఫింగ్ కుట్రని ఛేదించాల్సిన బాధ్యత పోలీసుల మీదనే వుంది. అది జరగాలంటే, ఆర్జీవీ అరెస్టవ్వాల్సిందే.!