Switch to English

ఆర్జీవీ ‘క్లైమాక్స్‌’ – మియా మల్కోవా కొత్తగా ఏం చూపించింది.!

సంచలనాలకు మారు పేరు రామ్ గోపాల్‌ వర్మ. ఒకప్పుడు రామ్ గోపాల్‌ వర్మ నుంచి సినిమా వస్తోందంటే, ఆయన అభిమానులు థియేటర్లకు పోటెత్తేవారు. ఇప్పుడు అభిమానులనేవారు వర్మ సినిమాలకు చాలా దూరంగా వుంటున్నారు. ఆయా సినిమాలతో వర్మ చేసే పబ్లిసిటీ స్టంట్లకు ఫిదా అయ్యేవాళ్ళే థియేటర్ల వద్ద కన్పిస్తున్నారు. ఆర్జీవీ అంటే ఓ సంచలనం. ఆర్జీవీని ఇప్పటికీ చాలామంది గురూజీ అని భావిస్తారు. కానీ, ఆర్జీవీ ప్రస్తుతం తీస్తోన్న సినిమాలు కావొచ్చు, వెబ్‌సిరీస్‌లు కావొచ్చు.. వాటిని చూసి ఆ శిష్యులే ముక్కున వేలేసుకుంటున్నారు. అయినాగానీ, ఆర్జీవీ రూటే సెపరేటు.

మొన్నామధ్య ‘జిఎస్‌టి’ అంటూ (గాడ్‌ సెక్స్‌ ట్రూత్‌) అనే వెబ్‌ సిరీస్‌ లాంటిది తీసిన వర్మ, అదే అడల్ట్‌ స్టార్‌ మియా మల్కోవాతో ‘క్లైమాక్స్‌’ తీశాడిప్పుడు. టీజర్‌ వచ్చేసింది.. తాజాగా, ఓ పాట తాలూకు ప్రమో కూడా రిలీజ్‌ చేశాడు. టీజర్‌లో ఏముంది.? సాంగ్‌ ప్రోమోలో ఏముంది.? అని ఆరా తీస్తే, మియా మల్కోవా మార్క్‌ అడల్ట్‌ కంటెంట్‌ తప్ప ప్రత్యేకంగా ఏమీ కన్పించడంలేదు.

షార్ట్‌ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌లతో పోల్చితే, అద్భుతమైన మేకింగ్‌ కూడా వున్నట్లు కన్పిడంచడంలేదు ప్రోమోస్‌లో. ఇక, మియా మల్కోవాలో కూడా కొత్తగా చూపించడానికేమీ లేదు. ఆమె ఓ పోర్న్‌ స్టార్‌. అడల్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో ఆమె చెయ్యాల్సిందంతా చేసేసింది.. చూపించాల్సిందంతా చూపించేసింది. మనోళ్ళకి ఇవన్నీ కొత్త గనుక, దీని కోసం ఎగబడ్తారని అనుకుంటే ఎలా.?

స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో వున్న ప్రతివాడికీ మియా మల్కోవా ‘అడల్ట్‌ వీడియోలూ’ అందుబాటులోనే వుంటాయ్‌. పాపం వర్మ మాత్రం, మియా మల్కోవా డెడికేషన్‌ గురించీ, ఆమె అందం గురించీ మాట్లాడుతున్నాడు. ప్చ్‌.. వర్మ అలా తయారయ్యాడు చివరికి.

 

 

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌ ప్రస్తుతం హీరోయిన్‌ పూజా కుమార్‌ తో...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ బాగా పెరిగింది. వరసగా టాలీవుడ్ లో...

సీఎం జగన్‌ 2020 క్యాలెండర్‌ అదిరిందిగానీ.!

సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌, మిగతా రాష్ట్రాలతో పోల్చితే ముందంజలో వుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతోంది. విభజన నేపథ్యంలో ఏర్పడ్డ కష్టాలు...

కొడుకు ప్రాణాలు కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన తండ్రి

కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఏ తండ్రైనా చూస్తూ ఎలా ఊరుకోగలడు. తన ప్రాణాలైనా పణంగా పెట్టి కాపాడాలనుకుంటాడు కదా. ఒక హాలీవుడ్ నటుడు కూడా ఇలాగే కొడుకు ప్రాణాలు కాపాడబోయి తన...

వైసీపీ రంగుల పైత్యం.. ఈసారీ ‘సర్కారు’ పప్పులుడకలేదంతే.!

ఓ గ్రామంలో ఓ వంద ఇళ్ళు వున్నాయనుకుందాం.. అందులో 30 ఇళ్ళో 40 ఇళ్ళో వైసీపీ మద్దతుదారులవో వున్నాయనుకుందాం.. వాటికి వైసీపీ రంగులేసుకోవచ్చు కదా.? ప్రభుత్వ కార్యాలయాలకే వైసీపీ రంగులేయాలని వైఎస్‌ జగన్‌...