ఈ నడుమ చిన్న సినిమాలు కూడా మంచి కంటెంట్ తో వస్తున్నాయి. ఇదే బాటలో తమ సినిమా కూడా ఉంటుందని చెబుతున్నారు రివైండ్ మూవీ మేకర్స్. రివైండ్ సినిమాలో సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లు గా నటించారు. కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా, దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కించారు. క్రాస్ వైర్ క్రియేషన్స్ పై నిర్మాతగా ఆయన వ్యవహరిస్తున్నారు. శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఆశీర్వాద్ అందించిన పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి.
జబర్దస్త్ నాగి, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్ లాంటి కమెడియన్లు బాగానే ఉన్నారు. ఈ మూవీ ఈ నెల 18న రాబోతోంది. ఈ క్రమంలోనే నిర్మాత, దర్శకుడు కళ్యాణ్ చక్రవర్తి సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఈ మూవీ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకున్నట్టు చెప్పారు. తాము విడుదల చేసిన సాంగ్స్ అన్నీ కూడా మిలియన్ల వ్యూస్ తో మంచి స్పందన తెచ్చుకన్నట్టు ఆయన వివరించారు. సాఫ్ట్వేర్ వద్దురా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ముఖ్యంగా లవ్ యు నాన్న సాంగ్స్ జనాల్లోకి బాగా వెళ్లాయని ఆయన వివరించారు.
సినిమా షోలు ఇప్పటికే చూపించగా.. డిస్ట్రీబ్యూటర్లు కూడా బాగుందని విడుదల చేయడానికి ముందుకొచ్చినట్టు తెలిపార చక్రవర్తి. ఈ మూవీ టైమ్ ట్రావెల్ కథతో వస్తోందని.. మంచి సన్నివేశాలతో పాటు వినోదం పంచుతుందని ఆయన స్పష్టం చేశారు. సౌత్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామని.. మూవీని ఆదరించాలని ఆయన కోరారు.