Switch to English

రివర్స్‌ గేర్‌: మద్యం అమ్మకాలతో కేంద్రానికేంటి సంబంధం.?

బీజేపీ నేతలు తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడతారోగానీ.. ఒక్కోసారి అర్థం పర్థం లేకుండా మాట్లాడేస్తారు. ఎవర్నో మభ్యపెట్టాలనే ప్రయత్నంలో బుకాయింపులకు దిగడం బీజేపీ నేతలకు కొత్త కాదు. మరీ ముఖ్యంగా, ఏపీ బీజేపీ నేతలు ఈ విషయంలో పలుమార్లు బొక్కబోర్లా పడ్డారు.

తాజాగా, మద్యం అమ్మకాల వ్యవహారంపై బీజేపీ సీనియర్‌ నేత ఒకరు, ‘రాష్ట్రం మద్యం దుకాణాల్ని తెరిస్తే, కేంద్రానికి ఏంటి సంబంధం.?’ అని ప్రశ్నించేశారు. నిన్నటికి నిన్న ఓ మంత్రిగారు, ‘కేంద్రం మద్యం దుకాణాలు తెరవాలని చెప్పింది.. అందుకే మద్యం దుకాణాల్ని తెరిచాం..’ అని సెలవిచ్చారు.

నిజమే, కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది లాక్‌డౌన్‌ నుంచి. అయితే, రాష్ట్రంలో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన జగన్‌ ప్రభుత్వం, నలభై రోజులకు పైగా లాక్‌డౌన్‌తో, అనుకోకుండా కలిసొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ, ఆ పని చేయలేదు. పైగా, మద్యం ధరలు పెంచి, ఖజానాని నింపుకుంటూ, మద్య నియంత్రణలో ఇదో కీలకమైన అడుగు అని ప్రచారం చేసుకుంటోంది. తీరా, విమర్శలొచ్చేసరికి.. కేంద్రం తెరవమని చెప్పిందంటూ మద్యం షాపులు తెరవడంపై నెపాన్ని కేంద్రం మీద నెట్టేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నప్పుడు, అది పరోక్షంగా తెలంగాణకు ఇబ్బందికరం. దాంతో తెలంగాణ కూడా మద్యం దుకాణాల్ని తెరవక తప్పలేదు. ఎలా చూసినా, ఈ వ్యవహారంలో రాష్ట్రాల ‘కాసుల కక్కుర్తి’, కేంద్రం అవివేకం.. రెండూ కలిసే లిక్కర్‌ షాపులు తెరవడానికి కారణం. ‘మద్యం అమ్మకాలతో మాకేటి సంబంధం.?’ అని ప్రశ్నిస్తున్న ఏపీ బీజేపీ నేతలు, అసలు కేంద్రమెందుకు ఆ ప్రకటన చేసిందో చెప్పలేకపోతున్నారు.

స్కూళ్ళు తెరవట్లేదు, ఏ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాల్నీ తెరవట్లేదు.. కానీ, మద్యం దుకాణాల్ని తెరిచేందుకు అనుమతిచ్చేసింది కేంద్రం. ఏమన్నా అంటే, ‘అది కేంద్రానికి సంబంధించిన విషయం.. మా పార్టీకి సంబంధించిన విషయం కాదు’ అని బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు ‘కవరింగ్‌’ ఇస్తారేమో.!

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

విశాఖ గ్యాస్‌ లీక్‌: ఎల్జీ పాలిమర్స్‌కి బిగ్‌ షాక్‌.?

యావత్‌ భారతదేశాన్ని కుదిపేసింది విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన. ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన విష వాయువు లీక్‌ కావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన ‘స్టైరీన్‌’...

మనుషులకు డాల్ఫిన్లు గిఫ్టులిస్తున్నాయ్.. ఎక్కడో తెలుసా?

డాల్ఫిన్లు చాలా తెలివైనవన్న సంగతి తెలిసిందే కదా? అవి మనుషులతో చాలా స్నేహపూరితంగా కూడా ఉంటాయి. ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవడంలోనూ, సమస్యల్ని పరిష్కరించే విధానంలోనూ ఇతర జీవుల కంటే డాల్పిన్లు చాలా...

క్రైమ్ న్యూస్: పూడ్చి పెట్టిన బాలిక శవం తీసి రేప్ చేసిన వృద్ధుడు

దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రతి రోజు మీడియాలో చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఎంతగా కఠిన శిక్షలు విధిస్తున్నా, ఉరి శిక్షలు అమలు చేస్తున్న కూడా నిచులు తమ. బుద్దిని...

సీఎం జగన్‌ 2020 క్యాలెండర్‌ అదిరిందిగానీ.!

సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌, మిగతా రాష్ట్రాలతో పోల్చితే ముందంజలో వుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతోంది. విభజన నేపథ్యంలో ఏర్పడ్డ కష్టాలు...

సఫారీలో సింహాన్ని తేలిగ్గా తీసుకుంటే కార్ డోర్ తీసేసింది.. ఆ తర్వాత..

తెలుగులో వచ్చిన ఆరెంజ్ సినిమాలో జెనీలియాను అడవికి తీసుకెళ్లి దగ్గరగా సింహాన్ని చూపిస్తాడు రామ్ చరణ్. దీంతో హీరోయిన్ అదిరిపోయి.. బెదిరిపోతుంది. అటువంటి సన్నివేశమే కాస్త డిఫరెంట్ గా సఫారీ రైడ్స్ కు...