బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు ఎత్తక పోవడం పట్ల ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ ఎందుకు కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేయలేదు అనే చర్చ ప్రధానంగా సాగుతోంది. కేసీఆర్ కు ప్రధాని భయపడ్డాడు అంటూ కొందరు అంటూ ఉంటే.. మరి కొందరు ప్రధాని మాట్లాడితే కేసీఆర్ కు జాతీయ స్థాయి మీడియాలో ప్రాముఖ్యత పెరుగుతుంది.
అందుకే కేసీఆర్ గురించి మోడీ మాట్లాడలేదు అంటున్నారు. టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం విభిన్నంగా స్పందించాడు. కేసీఆర్ మరియు మోడీల మద్య స్నేహంకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. రెండు పార్టీలు కూడా పైకి కొట్టుకున్నా చివరకు కేసీఆర్ అధిష్టానం మోడీనే అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవ చేశాడు. టీఆర్‌ఎస్ నాయకులు మాత్రం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు.