భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు తగవని.. పార్టీ నేత తీరుకు క్షమాపణ చెప్తున్నట్టు పేర్కొన్నారు. ఈ తరహా భాష ఎవరికీ మంచిది కాదంటూ ఓ వీడియో విడుదల చేశారు.
దీనిపై అద్దంకి దయాకర్ స్పందిస్తూ.. ‘పెద్ద మనసుతో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. చుండూరు సభలో నా వ్యాఖ్యలకు బాధపడుతున్నాను. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఇప్పటికే రాతపూర్వకంగా వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పాను. బహిరంగంగా కూడా క్షమాపణలు చెప్పాను’ అని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో పార్టీ కార్యక్రమంపై పీసీసీ నుంచి నాకు సమాచారం ఇవ్వలేదు. చుండూరు సభలో పిల్లాడితో నన్ను తిట్టించారు. కాంగ్రెస్ పాదయాత్రకు నన్ను పిలవలేదు. పిలవని పేరంటానికి నేనెందుకు వెళ్తాను’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి క్షమాపణపై ఆయన స్పందనపై ఆసక్తి నెలకొంది.
My apologies to brother and colleague @KomatireddyKVR garu. @manickamtagore @UttamINC pic.twitter.com/v7gkvXtlRD
— Revanth Reddy (@revanth_anumula) August 13, 2022