Switch to English

జగన్ విషయంలో రాయిటర్స్ రూటు మారింది

కియా పరిశ్రమ తరలిపోతోందంటూ సంచలన కథనం రాసి ఏపీలో కలకలానికి కారణమైన ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్.. ఏపీ సీఎం జగన్ విషయంలో తన వైఖరి మార్చుకున్నట్టు కనిపిస్తోంది. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల మోడల్ మంచిదేనంటూ ఓ కథనం ప్రచురించింది. మూడు రాజధానుల అంశాన్ని ప్రధాన మీడియా అంతా వ్యతిరేకిస్తున్న తరుణంలో రాయిటర్స్ కథనం జగన్ సర్కారుకు ఊరటగానే చెప్పొచ్చు.

నగరీకరణ పెరుగుతుండటం.. పల్లెల నుంచి రాజధాని ప్రాంతానికి వలసలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అక్కడ ఉత్పన్నమయ్యే సమస్యలు మూడు రాజధానుల కారణంగా తగ్గుతాయని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. జగన్ ప్రతిపాదనను సమర్థిస్తూ ఆ కథనాన్ని ప్రచురించింది. మరి దీని వెనుక జగన్ మీడియా సలహాదారులు ఏమైనా కసరత్తు చేశారా? లేక రాయిటర్సే సొంతంగా ఆ కథనం రాసిందా అనేది తెలియలేదు.

నిజానికి కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతోందంటూ రాయిటర్స్ లో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. దాని ఆధారంగా తెలుగుదేశం అనుకూల మీడియా జగన్ కు వ్యతిరేకంగా కథనాలు గుప్పించింది. ఇక టీడీపీ నేతలు ఒక్కసారిగా జగన్ పై విరుచుకుపడ్డారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేని జగన్.. తాము తీసుకొచ్చిన పరిశ్రమలను సైతం వెళ్లిపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఇదంతా తప్పని అటు ప్రభుత్వం, ఇటు కియా సంస్థ చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో రాయిటర్స్ కు, టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్య ఉన్న సంబంధాన్ని వైసీపీ బట్టబయలు చేసింది.

గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నుంచి రాయిటర్స్ సంస్థ లబ్ధి పొందిందని, ఈ నేపథ్యంలో ఆ రుణం తీర్చుకునేందుకే ఇలాంటి అసత్య కథనం వండి వార్చిందని వైసీపీ నేతలు దుయ్యబట్టారు. అనంతరం ఈ వివాదం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ సర్కారుకు అనుకూలంగా రాయిటర్స్ లో కథనం రావడం టీడీపీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

దేవభూమిలో అగ్ని ప్రమాదంపై సినీ ప్రముఖుల స్పందన

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా లక్షల మంది భయాందోళనతో వణికి పోతున్న ఈ సమయంలో మరో వైపు తుఫాన్‌, భూకంపాలు, అగి ప్రమాదాలు జరుగుతున్నాయి. పకృతి విపత్తులు జరుగుతున్న ఈ సమయంలో అత్యంత...

లిక్కర్‌ యాప్‌ గంటలో లక్ష

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గత మూడు నెలలుగా ఇండియాను కూడా కరోనా గడగడలాడిస్తూనే ఉంది. ప్రస్తుతం ఇండియాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది....

విజయ్ సినిమాకు 20 కోట్ల నష్టం.. నిజమెంత?

తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరో ఎవరంటే కచ్చితంగా విజయ్ పేరు ముందు వినిపిస్తుంది. రీసెంట్ గా కూడా అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్యన ఈ విషయంలో పెద్ద రచ్చే జరిగేది కానీ...

తన బిడ్డలను వేదిస్తున్నారంటూ కువైట్‌ నుండి తల్లి ఫిర్యాదు

తూర్పుగోదావరి నుండి ఉపాది కోసం కువైట్‌ వెళ్లిన ఒక మహిళ తన ఇద్దరు కూతుర్లను ఆకతాయిలు వేదిస్తున్నారు అంటూ వీడియో కాల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. తన కూతుర్లను చిన్న పిల్లలు చేసి...