ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,724FansLike
57,764FollowersFollow

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని కుండబద్దలుగొడుతుంటారు. తరచూ, పబ్లిసిటీ స్టంట్లు కూడా చేస్తుంటారాయన. రీచ్ కోసం పడే కష్టాలు కావొచ్చన్న వాదన లేకపోలేదనుకోండి.. అది వేరే సంగతి.

ఈ రిటైర్డ్ ఐపీఎస్ తాజాగా, ఏపీ మంత్రి నారా లోకేష్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ, సుదీర్ఘమైన పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టారు. లోకేష్ మీద ఎందుకు ఆయన ఆరోపణలు చేయాల్సి వచ్చింది.? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. పైగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో, ఏపీ మంత్రి నారా లోకేష్‌ని పోల్చుతూ, అవినీతి ఆరోపణలు కూడా చేశారు రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విలాసవంతమైన ప్యాలెస్సులు వున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ప్యాలెస్సులే, నారా లోకేష్ కూడా కట్టుకుంటున్నారన్నది నాగేశ్వరరావు ఆరోపణ.
హైద్రాబాద్‌లో చంద్రబాబు కుటుంబానికి ఓ ఇల్లు వుంది. అమరావతిలో లేదు. సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబుకి ఇల్లుంది. చంద్రబాబు, లోకేష్ కలిసే వుంటారు కాబట్టి.. ఇద్దరినీ విడివిడిగా ప్రస్తావించడం సబబు కాదేమో, సొంతిల్లు విషయంలో.

అమరావతిలో ఇల్లు కట్టుకునే దిశగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న చంద్రబాబు, లోకేష్.. ఇంటి నిర్మాణ పనులు మొన్నామధ్యన ప్రారంభించారు. అది తప్పేమీ కాదు కదా.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం వేరు, ఆయన ప్యాలెస్సుల కథ వేరు.

ఇక, అవినీతి ఆరోపణలతో వైసీపీకి చెందిన ముఖ్య నాయకులెవర్నీ జైల్లో వెయ్యలేదంటూ, నారా లోకేష్ మీద అనుమానాలు వ్యక్తం చేశారు రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావు. కానీ, ఇప్పటికే చాలామంది వైసీపీ ముఖ్య నేతలు అరెస్టయ్యారు, కొందరు జైళ్జలో వున్నారు కూడా.

రాజకీయంగా బలపడే క్రమంలో, కేంద్రంలోని బీజేపీతో నారా లోకేష్ సన్నిహిత సంబంధాలు పెంచుకుంటున్నారనీ, ఏపీలో ప్రభుత్వం మారినా, తనకు రక్షణ కవచాల్ని ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నారనీ నాగేశ్వరరావు ఆరోపణలు చేశారు.

మొత్తం నాగేశ్వరరావు ట్వీటు కథనంలో, నారా లోకేష్ మీద అక్కసు తప్ప, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నారా లోకేష్‌ని పోల్చడంలో అర్థమే లేదన్నది సుస్పష్టమవుతోంది. అయితే, ఈ కథనం వెనుక కుట్ర కోణమేంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

కేంద్రంలోని బీజేపీ వాసన కూడా పడటం లేదు రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావుకి. టీడీపీ మీద, అందునా లోకేష్ మీద కూడా ఏదో తెలియని ద్వేషం ఆయనతో ఈ సోషల్ కథనాన్ని వండి వడ్డించేలా చేసిందేమో.!

సినిమా

“పెద్ద కలలు కనండి.. కష్టపడితే విజయం మీదే” – ‘చెన్నై లవ్...

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ...

బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ హెల్త్ బులెటిన్.. గాయం వివరాలు వెల్లడి

నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా ఎడమ మోకాలికి గాయం కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు...

‘సమ్మర్ హాలిడేస్’లో జయసుధ అమ్మమ్మ లుక్ విడుదల

కథా ప్రధానమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని, తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న చిల్డ్రన్ మూవీ...

Chiranjeevi Birthday Special: చిరంజీవి మాస్ సినిమాలకు C/o దొంగమొగుడు

Chiranjeevi Birthday Special: ప్రతి ఏటా ఆగష్టు నెల వస్తుందంటే మెగాభిమానుల్లో ఆనందోత్సాహలు. ప్రతి ఏటా ఆగష్టు నెల రావడంతోనే చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22వ...

బాలయ్య త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్ష

కాకినాడలో 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై...

రాజకీయం

తిరుమలలో హనుమాన్ విగ్రహం అపహరణ.. 24 గంటల్లో నివేదిక కోరిన మంత్రి

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే డౌన్ ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద భక్తులు ప్రతిష్ఠించిన చిన్న హనుమాన్ రాతి విగ్రహం అపహరణకు గురైన ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం...

నీట్ రగడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చెయ్యాల్సిందేనా.?

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ఓ వైపు.. నీట్ వివాదం ముసుగులో అసాంఘీక శక్తుల అరాచకం ఇంకో వైపు.. వెరసి, దేశ రాజధానిలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది. పోటీ పరీక్షలకు...

పవన్‌పై ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి: జనసేన తెలంగాణ

హైదరాబాద్‌లోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్...

ప్రభుత్వ పాఠశాలలే ఆదర్శం కావాలి: లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, ప్రైవేటు పాఠశాలలు కూడా చూసి అసూయపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో...

కాదంబరి జెత్వానీ కేసు.. అసలు నిజాలివే!

కాదంబరి జెత్వానీ వ్యవహారం మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ అంశంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు పోస్టుల్లో...

ఎక్కువ చదివినవి

డాక్టర్ హత్య కేసు.. భార్యపై అనుమానాలు?

కర్ణాటకలోని ధారవాడలో ఓ ప్రముఖ వైద్యుడు తన ఇంట్లోనే దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. 45 ఏళ్ల అనస్థీషియాలజిస్టు డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ అపార్ట్‌మెంట్‌లో మృతిచెందగా, ఆయన 8 ఏళ్ల కుమారుడు...

Daily Horoscope: కర్కాటకం వారికి ఆర్థిక శుభవార్త.. ధనుస్సు వారు మాటలో సంయమనం పాటించాలి

జులై 21, 2026 మంగళవారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా ఈరోజు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం,...

Daily Horoscope: కర్కాటకం వారికి ఆర్థిక పురోగతి.. తుల వారికి శుభవార్తలు!

జులై 16 , 2026 గురువారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ప్రకారం నేటి గ్రహస్థితి కొన్ని రాశుల వారికి శుభఫలితాలను, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్త అవసరమని సూచిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం,...

పోక్సో చట్టం అమలుపై పవన్ కళ్యాణ్ కీలక లేఖ..

చిన్నారుల భద్రత, గౌరవం, సత్వర న్యాయం ప్రతి బాలబాలిక హక్కు అనే అంశాన్ని మరోసారి ప్రాధాన్యతగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కీలక లేఖ రాశారు....

మెగా డీఎస్సీపై వైసీపీ పిటిషన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

మెగా డీఎస్సీ నియామకాల అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (PIL) కొట్టివేయబడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో మెగా డీఎస్సీ...