రేణూ దేశాయ్ కు సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఎప్పటికప్పుడు వైరల్ అవుతోంది. రేణూ దేశాయ్ చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అకీరా, ఆద్య బాధ్యతలు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అన్ని విషయాలపై స్పందిస్తుంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేసే కొన్ని కామెంట్స్ పై సీరియస్ గానే రియాక్ట్ అవుతూ ఉంటుంది. పవన్ కు ఈ నడుమ బాగానే సపోర్టు చేస్తోంది. సోషల్ మీడియాలో జంతువుల కోసం ఫండింగ్ చేస్తూ సాయం చేస్తోంది.
ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తాను ఏడాది తర్వాత సినిమా కోసం మేకప్ వేసుకోనున్నాను అంటూ ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే ఏ సినిమాలో నటిస్తుందో మాత్రం చెప్పలేదు. ఆమె గతంలో రవితేజ సినిమాలో చేసింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలను ప్రకటించలేదు. ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ సినిమాను అనౌన్స్ చేసింది. ఆమె గతంలో నేను రెండో పెళ్లి చేసుకుంటా… నా పిల్లలు పెద్దయ్యాక చేసుకుంటా అని గతంలో చెప్పింది. కానీ మళ్లీ దానిపై ఇంకా స్పందించలేదు.
ప్రస్తుతం ఆమె పిల్లలు అకీరా, ఆద్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్నారు. అకీరా త్వరలోనే సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం అతను యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ఆద్య కూడా పవన్ తో పాటు కనిపిస్తోంది. మరి ఆద్య కూడా సినిమాల్లోకి వస్తుందా లేదా అనేది చూడాలి.