గ్లామర్ హీరోయిన్ రెజినా కు పెళ్లి ఫిక్స్ అయిందని .. అందుకే నిశ్చితార్థం కూడా సైలెంట్ గా జరిగిపోయినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల్ 13న కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో రెజినా నిశ్చితార్థం జరిగినట్టు, వచ్చే నెలలో వివాహం జరగనున్నట్టు ఆ వార్తల సారాంశం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రోల్స్ అవ్వడంతో రెజినా స్పందించింది.
నాకు పెళ్లి .. నిశ్చితార్థం జరిగినట్టు వస్తున్న వార్తల గురించి విన్నాను. గత వారం పైగా ఈ వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ న్యూస్ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నాకు ఏ నిశ్చితార్థం జరగలేదు. అసలు నాపెళ్ళి నాకు తెలియకుండా జరగడం అర్థం కాకుండా ఉంది. దయచేసి నాపై వస్తున్న ఈ వార్తలను ఎవరు నమ్మొద్దు. నాకు పెళ్లి చేసుకోవాలని అనిపించినప్పుడు తప్పకుండా అందరికి చెప్పే చేసుకుంటా అని స్పందించింది.
ప్రస్తుతం రెజినా స్పందనతో ఈ న్యూస్ పై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో రెజినా మళ్ళీ పెట్టింది. ఏ ఈమద్యే తెలుగులో 7 అంటూ ఓ థ్రిల్లర్ సినిమా చేసిన పెద్దగా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో చెరో సినిమా చేస్తుంది రెజినా.