Switch to English

రెడ్డి వర్సెస్‌ కమ్మ: ఎవరిది నేరం.? ఎవరిది పాపం.?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ‘కులం’ కంపు ఏ స్థాయిలో వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి స్థానంలో వున్న వ్యక్తి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని ‘కులం’ పేరుతో ‘ద్వేషించడం’ కుల రాజకీయాలకు పరాకాష్ట. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. రాష్ట్రంలో రెడ్డి వర్సెస్‌ కమ్మ అనే రాజకీయం నడుస్తోందన్నది నిర్వివాదాంశం.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినంతమాత్రా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తన బాధ్యతల్ని విస్మరించి, విపక్షానికి సహకరిస్తారా.? ఎంత నీఛమైన ఆలోచన ఇది.? కానీ, రాష్ట్రంలో అధికార పార్టీ ఆ కోణంలోనే చూసింది నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ (తాజా మాజీ స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌) వ్యవహారాన్ని. కరోనా వైరస్‌ తీవ్రతని ముందే అంచనా వేసి, రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయడమే ఆయన చేసిన నేరం.

తనపై ‘కమ్మ’ ముద్ర వేసి, అధికార పార్టీ మూకుమ్మడిగా రాజకీయ దాడి చేస్తోంటే, ఈ దాడిలో ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్‌ సహా మంత్రులు కూడా భాగమైతే, బాధిత అధికారి కేంద్రానికి ఫిర్యాదు చేయకూడదా.? ఫిర్యాదు చేస్తే, మళ్ళీ అందులోనూ ‘కుట్ర’ కోణం కన్పిస్తోంది అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి. నిమ్మగడ్డ రాసిన లేఖ కేంద్రానికి అందిందనీ, చర్యలు మొదలయ్యాయని సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రకటించాక కూడా అది ఫేక్‌ లెటర్‌.. అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రచ్చ షురూ చేశారు.

ఈ క్రమంలో సీఐడీ దర్యాప్తుకి రాష్ట్ర ప్రభుత్వమూ ఆదేశించింది. దర్యాప్తు ఓ పక్క జరుగుతోంటే, ఇంకోపక్క కోర్టులో విచారణ జరుగుతోంది. బహుశా దేశంలో ఇంకెక్కడా ఇంతటి హేయమైన ‘కుల రాజకీయం’ నడిచి వుండదేమో. న్యాయస్థానం ఏం తీర్పు చెబుతుందన్నది వేరే విషయం. ఈలోగా దేశం దృష్టిలో రాష్ట్రం పలచనైపోయింది. రాష్ట్రంలో కుల రాజకీయాలు, సగటు ప్రజానీకాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. కానీ, రాజకీయ నాయకులు మాత్రం ‘నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.?’ అన్నట్లు నిస్సిగ్గుగా వికటాట్టహాసం చేస్తున్నారు.

సినిమా

సౌత్ ఇండియన్ స్టార్‌ హీరోకు గాయాలు.!

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్‌ డంను సొంతం చేసుకున్న స్టార్‌ హీరో సూర్య తన హోం జిమ్‌ లో వర్కౌట్స్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది...

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

కరోనా ఎఫెక్ట్: సెన్సేషన్ అయిన యుఎస్ న్యూయార్క్ టైమ్స్ పత్రిక.!

ప్రస్తుతం ప్రపంచ జనాభాని, ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి పేరు కరోనా వైరస్. ఈ వైరస్ పుట్టింది చైనాలో అయినా భారీగా నష్టపోయింది మాత్రం ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా...

గుడ్ న్యూస్: జూన్ నుంచి షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్.!

నిన్ననే(మే 21న) సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులంతా కలిసి సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి, అలాగే థియేటర్స్ పరిస్థితిపై...

బిగ్ షాక్: స్వామి వారి ఆస్తులు వేలం వేస్తున్న టిటిడి.!

ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం తాను అనౌన్స్ చేసిన పథకాలు అమలు చేయడం కోసం ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్న విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఇది నడుస్తుండగా, మరో...

లెక్చరర్ కీచక పర్వం – యువతులను బ్లాక్ మెయిల్.. ఆపై.!

పెద్ద చదువు.. మంచి ఉద్యోగం.. గౌరవప్రదమైన హోదా.. వృత్తిపరంగా లెక్చరరే అయినా.. ప్రవృత్తి మాత్రం అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం. లెక్చరర్ గా పనిచేస్తున్న ఓ కీచకుడు చేస్తున్న వ్యవహారం ఇది. తాను పాఠాలు...

ఇన్‌సైడ్‌ స్టోరీ: ‘బాబు’లిద్దరూ హైద్రాబాద్‌లో ఇంకెన్నాళ్ళు.!

సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా, వ్యతిరేకంగా వేలాది, లక్షలాది పోస్ట్‌లు నిత్యం దర్శనమిస్తున్నాయి. వీటిల్లో మెజార్టీ పోస్ట్‌లు చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు గత కొన్నాళ్ళుగా హైద్రాబాద్‌కే పరిమితమవడంపై...