Switch to English

జగన్ తో అంబానీ భేటీకి అసలు కారణమిదీ..!

రిలయెన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చిన అంబానీ.. అక్కడ నుంచి నేరుగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టడం గురించే ఇరువరి మధ్యా చర్చ జరిగిందని చెబుతున్నప్పటికీ, ఈ సమావేశం అసలు ఎజెండా మాత్రం రాజకీయపరమైన అంశాలేనని తెలుస్తోంది.

తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి ఏపీ కోటాలో రాజ్యసభ సీటు ఇప్పించేందుకే ముకేశ్ అంబానీ నేరుగా జగన్ వద్దకు వచ్చినట్టు సమాచారం. కుమారుడితోపాటు రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ అంబానీ వెంట ఉన్నారు. జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నత్వానీ పదవీకాలం ముగుస్తోంది. ఇప్పటికే జార్ఖండ్ నుంచి రెండుసార్లు పెద్దల సభకు ఎన్నికైన నత్వానీ.. మరోసారి రాజ్యసభ సభ్యత్వం కోరుతున్నారు. అంబానీకి అత్యంత సన్నిహితుడు కావడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు.

ప్రస్తుతం బీజేపీకి ఎక్కడా రాజ్యసభ సభ్యులను గెలుచుకునే బలం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టిన షా.. వైసీపీ కోటాలో నత్వానీని పెద్దల సభకు పంపించాలని నిర్ణయించారు. మార్చి 26న జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఏపీ నుంచి నలుగురు ఎన్నికవుతారు. అసెంబ్లీలో ఉన్న బలం దృష్ట్యా ఆ నాలుగూ వైఎస్సార్ సీపీకే వస్తాయి. ఈ నేపథ్యంలో ఒక స్థానం తమకు ఇవ్వాలంటూ బీజేపీ జగన్ ను కోరినట్టు గతంలో వార్తలొచ్చాయి.

ఆ క్రమంలోనే జగన్ హడావుడిగా హస్తిన వెళ్లి అటు ప్రధాని మోదీని, ఇటు అమిత్ షాతో భేటీ అయి, దీనిపై చర్చించినట్టు తెలుస్తోంది. షా ప్రతిపాదనకు జగన్ ఓకే చెప్పడంతో అంబానీ అమరావతి వచ్చి మర్యాదపూర్వకంగా జగన్ తో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య పలు అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. మొత్తానికి ఒక రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా అటు బీజేపీ పెద్దలకు, ఇటు అంబానీకి జగన్ దగ్గరయ్యారని చెబుతున్నారు. ఈ కీలక రాజకీయ పరిణామం భవిష్యత్తులో జగన్ కు కచ్చితంగా ఉపకరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

ఫైర్ యాక్సిడెంట్: సికింద్రాబాద్ లో బూడిదైన 10 గుడిసెలు.!

తెలంగాణ, సికింద్రాబాద్, బోయినపల్లిలోని బాపూజీ నగర్ లో గుడిసెల్లో రోజువారి కూలీలు నివాసం ఉంటారు. అక్కడ ఒక్క గుడిసెలో సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. అతి తక్కువ టైములో...

త్రివిక్రమ్ – వెంకీ – నాని.. మళ్ళీ ఫేకే!

త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో చిత్రంతో తిరిగి టాప్ ఫామ్ లోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తో సినిమాకు కమిటయ్యాడు మాటల మాంత్రికుడు. ఎన్టీఆర్ తో చేసేది...

భార్య భర్తలకు కిమ్‌ ఉరిశిక్ష.. క్రూరత్వంకు పరాకాష్ఠ

ఉత్తర కొరియా నియంత పాలకుడు కిం జోంగ్‌ ఉన్‌ ఎంతటి క్రూరుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, తన గురించి తప్పుడు ప్రచారం చేసిన వారిని కనీసం కేసు...

ఇస్మార్ట్ భామకు బాగా బోర్ కొడుతోందిట

ఇస్మార్ట్ శంకర్ తో నభ నటేష్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో నటన పరంగానే కాకుండా వడ్డించిన గ్లామర్ విందుకు యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఇస్మార్ట్ శంకర్ నభ కెరీర్...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...