Mrunal Thakur: గతేడాది విడుదలైన సీతారామం(Seetaramam) సినిమాతో హిట్ అందుకుంది మృనాల్ ఠాకూర్( Mrunal Thakur). సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. గతంలో చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని ఇప్పుడు సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఈ మేరకు కన్నీళ్ళతో ఉన్న ఫోటోని షేర్ చేసింది.
‘ కొద్దిరోజుల క్రితం చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నా. ప్రస్తుతం తెలివిగా మారాను. ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ప్రతి ఒక్కరికి బయటకు చెప్పుకోలేని ఓ కథ ఉంటుంది. కానీ నేను అలా కాదు. నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలనుకుంటాను. ఎందుకంటే నాలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్లు నా నుంచి ప్రేరణ పొందుతారని అనుకుంటాను’ అని పోస్ట్ చేసింది. దీనిపై నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ‘మేడమ్ ప్రేమలో విఫలమయ్యారా?, ‘ ధైర్యంగా ఉండండి. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం’ అంటూ భిన్నంగా స్పందించారు.
వీటిపై స్పందిస్తూ.. మృనాల్ మరో పోస్ట్ చేసింది ‘ ఇప్పుడు నేను గతం కంటే దృఢంగా మారాను. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాను. ఆ ఫోటో నేను డిప్రెషన్ తో బాధపడుతున్నప్పుడు తీసుకున్నది’ అని సమాధానం ఇచ్చింది.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతారామం’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) కు జోడిగా మృనాల్ నటించింది. ఆ సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ గా, సీత గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా ఓ సినిమాలో నటిస్తోంది.
I am genuinely happy to glance at this blog posts which
includes lots of helpful information, thanks for
providing these kinds of information.
I’m not that much of a internet reader to
be honest but your blogs really nice, keep it up! I’ll go ahead and
bookmark your website to come back down the road. Many thanks