Switch to English

అంబేద్కర్ జిల్లా వెనుక అంత పెద్ద కథ వుందట.!

కోనసీమ జిల్లా కాస్తా అంబేద్కర్ జిల్లాగా మారబోతోంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా ఇటీవల వైఎస్ జగన్ సర్కారు మార్చిన విషయం విదితమే. కోనసీమ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక జిల్లా.! ఆ ‘కోనసీమ’ గుర్తింపు కొద్ద రోజుల్లో కనుమరుగు కాబోతోందన్న ఆవేదన కోనసీమ ప్రాంత ప్రజల్లో కనిపిస్తోంది.

కొత్త జిల్లాల విభజనతో కోనసీమ వాసుల కల నెరవేరినా, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ‘మాది కోనసీమ..’ అని చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితి వస్తోందంటూ కోనసీమ జిల్లా వాసులు కొందరు వాపోతున్నారు. కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాలనీ, బాలయోగి పేరు పెట్టాలనీ చాలాకాలంగా డిమాండ్లు వస్తున్నమాట వాస్తవం.

‘కోనసీమ బాలయోగి.. కోనసీమ అంబేద్కర్..’ ఇలా పేర్లు పెడితే పెద్దగా అభ్యంతరం వుండదేమో.! ప్రస్తుతానికి కోనసీమగా వున్న ఈ జిల్లా పేరుని మార్చి, ‘కోనసీమ అంబేద్కర్..’ లేదా, అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

అయినా, రాష్ట్రంలో 26 జిల్లాలు వుండగా, ఒక్క కోనసీమ జిల్లాకే అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ రావడమేంటి.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే. రాజకీయంగా రాష్ట్రంలో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో కోనసీమ ఒకటి. అందుకే, ఇక్కడ అధికార వైసీపీ అత్యంత వ్యూహాత్మకంగా ‘పేరు’తో రాజకీయాలు చేస్తోందన్నది ప్రధానంగా వినిపిస్తోన్న విమర్శ.

ఒక్క సంక్షేమ పథకానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టలేదుగానీ, జిల్లాలకు అంబేద్కర్ పేరు పెట్టి, ఏం సందేశాన్ని పంపిస్తున్నట్లు.? అన్న విమర్శ కూడా లేకపోలేదు. వైఎస్సార్ పేరుతో జిల్లా వుంది, కొన్ని సంక్షేమ పథకాలకీ ఆ పేరు వుంది. అల్లూరి పేరుని ఓ జిల్లాకి పెట్టారు.. ఎన్టీయార్ పేరుని కూడా ఓ జిల్లాకి పెట్టారు. మరి, అలా సంక్షేమ పథకాలకు ఆయా పేర్లు ఎందుకు పెట్టడంలేదన్న చర్చ మొదలైందిప్పుడు.

రాజకీయం అంటేనే అంత.! కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా దళితులకి సముచిత గౌరవం ఇచ్చామనో, అంబేద్కర్‌ని గౌరవించేశామని చెప్పడం ద్వారా దళిత ఓటు బ్యాంకుని క్యాష్ చేసుకోవడమే ప్రధాన అజెండా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, కామెడీతో.. ‘అం అః’ సినిమా..! ట్రైలర్ విడుదల

సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా శ్యామ్ మండల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అం అః'. (ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్లర్) ట్యాగ్‌లైన్‌. రంగ‌స్థలం మూవీ...

లైగర్ ‘పీకే’ పోస్టర్‌ తో పబ్లిసిటీ పీక్స్‌

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాద్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. షూటింగ్ ముగిసి నెలలు గడుస్తోంది....

పుష్ప 2 ఫైనల్ వర్షన్‌ ఇంకా రెడీ అవ్వలేదట

అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబోలో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతటి ఘన విజయాన్ని సొంతం...

దిల్ రాజు ప్లాన్ తో ఆ సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ గందరగోళం

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కమ్‌ డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు సినిమా ల రిలీజ్ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా...

మేజర్‌ కు అక్కడ కూడా బ్రహ్మరథం

అడవి శేష్‌ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన మేజర్‌ సినిమా విడుదల అయిన ప్రతి చోట కూడా పాజిటివ్‌ రెస్పాన్స్ ను దక్కించుకుంది....

రాజకీయం

మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లతో నిరసన..! పలువురి అరెస్టు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు....

‘వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే..’ అల్లూరి జయంతి వేడుకల్లో కేటీఆర్

వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై...

ఫాఫం రఘురామ.! చేసుకున్నోడికి చేసుకున్నంత.!

అంతన్నాడింతన్నాడే గంగరాజు.. అన్న పాట గుర్తుకొస్తోంది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా పరిస్థితి చూస్తోంటే. కొండంత రాగం తీసి తుస్సుమనిపించేశారాయన. ఔను మరి, కోర్టుకెళ్ళారు.. ప్రత్యేక హెలికాప్టర్ అన్నారు.. చివరికి రైలులో పయనమైనా,...

యావత్ భారతావని తరపున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నా: ప్రధాని మోదీ

భారతావని మన్యం వీరుడు, విప్లవ జ్యోతి, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మనమంతా కలుసుకోవడం అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు...

అల్లూరి చుట్టూ రాజకీయం.! ఇదా ఆయనకిచ్చే గౌరవం.?

ఓ సినీ కవి, మహాత్మాగాంధీని ఉద్దేశిస్తూ.. ‘ఇలా నడి రోడ్డు మీదా.. కరెన్సీ నోటు మీదా.. మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ..’ అంటాడు. మహనీయుల్ని మనం ఎలా చూస్తున్నాం.? అన్న విషయమై...

ఎక్కువ చదివినవి

హైదరాబాద్ కు టూరిస్టులు వచ్చారు.. రాష్ట్రాభివృద్ధి చూసి వెళ్తారు: తలసాని

‘బీజేపీ కార్యవర్గ భేటీ పేరుతో హైదరాబాద్ కు టూరిస్టులు వచ్చారు.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి వెళ్తారు’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట విమానాశ్రమంలో ప్రధాని మోదీకి స్వాగతం...

‘ఆమె దేశానికి క్షమాపణలు చెప్పాలి’ నుపూర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటివల దేశంలో జరిగిన ఘటనలకు ఆమె వ్యాఖ్యలే కారణమని.. దేశానికి...

రాబోయే 30-40 ఏళ్లు దేశంలో బీజేపీ హవా

హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి.. బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రాబోయే రోజుల్లో విశ్వ...

పటేల్ వర్సెస్ అల్లూరి.! ఎవరు గొప్ప.? ఎందుకీ చర్చ.!

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ భీమవరంలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నారు, విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. అల్లూరి జయంతి వేడుకలు అలాగే, ఆజాదీ కా అమృత మహోత్సవ...

గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ.. ఘనస్వాగతం పలికిన గవర్నర్, సీఎం

ఏపీ పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు ఘన...