Switch to English

జస్ట్ మిస్: అన్నీ సెట్ అయ్యాక చిరు, వెంకీ, నాగ్‌ల మల్టీస్టారర్‌ కాన్సల్ ఎందుకయ్యిందంటే?

టాలీవుడ్‌ ప్రేక్షకులు మల్టీస్టారర్‌ చిత్రాల కోసం మొహం వాచి ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత భారీ మల్టీస్టారర్‌ చిత్రంకు రంగం సిద్దం అయ్యింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ కరోనా లేకుంటే బ్యాలన్స్‌ షూట్‌ ఇప్పటి వరకు పూర్తి అయ్యి ఉండేది. ఈ మల్టీస్టారర్‌ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతకు మించిన మల్టీస్టారర్‌ ఒకటి 2002లో రావాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఆ భారీ మల్టీస్టారర్‌ క్యాన్సిల్‌ అయ్యింది.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన 100వ సినిమాగా చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జునలతో భారీ మల్టీస్టారర్‌కు ప్లాన్‌ చేశాడు. త్రివేణి సంగమం అనే టైటిల్‌ను ఖరారు చేయడంతో పాటు కథ రెడీ అయ్యింది. చిన్ని కృష్ణ సిద్దం చేసిన కథకు ముగ్గురు హీరోలు ఓకే చెప్పారు. రామానాయుడు, అశ్వినీదత్‌, అల్లు అరవింద్‌లు ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. మునుపెన్నడు లేనంత భారీ బడ్జెట్‌తో రాఘవేంద్ర రావు ఈ సినిమాను తీసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

షూటింగ్‌కు మరో వారం పదిరోజుల్లో వెళ్లబోతున్నారు అనగా క్లైమాక్స్‌ విషయంలో విభేదాలు వచ్చాయి. సరైన క్లైమాక్స్‌ కుదరలేదు. నిర్మాతలు మరియు దర్శకుడితో పాటు హీరోలకు క్లైమాక్స్‌ విషయంలో నమ్మకం కలుగక పోవడంతో మొత్తం సినిమానే క్యాన్సిల్‌ చేశారు. ఆ సినిమా కనుక తెరకెక్కి ఉంటే తెలుగు సినిమా చరిత్రలో అతి పెద్ద మల్టీస్టారర్‌గా అప్పుడు ఇప్పుడు ఎప్పటికి నిలిచి పోయి ఉండేది. ఈ సినిమా క్యాన్సిల్‌ అవ్వడంతో రాఘవేంద్ర రావు తన 100వ సినిమాగా అల్లు అర్జున్‌తో గంగోత్రిని తెరకెక్కించిన విషయం తెల్సిందే. 

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ప్చ్.. జగన్ ఏడాది ఆనందం అలా ఆవిరైపోయింది.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో గెలుపొంది శనివారం నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయితే, ఏడాది ఆనందం ప్రస్తుతం ఆ పార్టీకి అంతగా లేదు. అది ఏ కరోనా కారణంగా అనుకుంటే పొరపాటే....

విశాఖ వాసుల్ని బెంబేలెత్తించిన దట్టమైన పొగలు

12 మంది ప్రాణాలు బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవక ముందే మరో ఘటన విశాఖ ప్రజల్ని భయాందోళనలకు గురి చేసింది. కొద్దిసేపటి క్రితం విశాఖ, మల్కాపురంలోని HPCL రిఫైనరీ నుంచి దట్టమైన...

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్ ల సపోర్ట్.!

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' ఫస్ట్ ప్రమోషనల్...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...