Switch to English

మందుకెందుకంత తొందర.. ముందంతా బతుకు చిందరవందర

ఓవైపు ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలమవుతోంది. వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. ఈ వైరస్ మహమ్మారిని ఎలా అదుపు చేయాలో దేశాలన్నీ సతమతమవుతున్నాయి. కరోనా నివారణ ఔషధం, వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. పరిస్థితులన్నీ ఇలా ఉంటే.. మన ప్రభుత్వాలకు మాత్రం మందు అమ్మకాలకు తొందరొచ్చేసింది.

అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు కానీ.. మద్యం అమ్మకాల ద్వారా వేగంగా కొంత ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉండటంతో వాటి విక్రయాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు బార్ల గేట్లు బార్లా ఎత్తేశాయి. దాదాపు ఆరు వారాలుగా చుక్క లేక చిక్కిశల్యమైన మందుబాబులకు ఎక్కడ లేని హుషారూ వచ్చేసింది. సరిహద్దులు సైతం దాటేసి మద్యం షాపుల ముందు వాలిపోయారు.

భౌతికదూరం మాట అటుంచితే.. గతంలో స్టార్ హీరో సినిమా టికెట్ల కోసం తన్నుకుని, తోసుకునే దృశ్యాలే మరోసారి సాక్షాత్కరమయ్యాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడ చూసినా బార్ల ముందు కిలోమీటర్ల కొద్దీ లైన్లే కనిపించాయి. బెంగళూరులో అయితే అమ్మాయిలు కూడా లైన్లో నిలబడి మరీ కావాల్సిన కొనుక్కొని వెళ్లడం చూసి పెద్ద తరం ముక్కును వేలేసుకుంది.

చాలా షాపుల్లో సరుకు మొత్తం మధ్యాహ్నానికే ఖాళీ అయిపోయింది. షాపులు తెరిచిన తొలిరోజే ఆయా ప్రభుత్వాలకు కోట్లలో ఆదాయం సమకూరింది. తద్వారా తాము తీసుకున్న నిర్ణయం ఆదాయపరంగా సబబే అని ప్రభుత్వాలు సమర్థించుకోవచ్చు గాక. ఆరువారాలుగా చుక్క కోసం పరితపించిన మద్యం ప్రియులు తమ గొంతు తడుపుకొని ఆనందడోలికల్లో తేలియాడి ఉండొచ్చు గాక. కానీ కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్న ఈ సమయంలో ఇది కరెక్టేనా? అని ప్రశ్నించేవారూ కోకొల్లలుగా ఉన్నారు.

మద్యం ఈ మహమ్మారి కంటే ప్రమాదకరమని.. దీనిని నియంత్రించేందుకు ఇంత కష్టపడి విధించుకున్న లాక్ డౌన్ శ్రమంతా బూడిదలో పోసినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం షాపులు తెరచిన తొలిరోజు చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శమని పలువురు పేర్కొంటున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక ప్రస్తుత తరుణంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం మహాతప్పిదమని అంటున్నారు.

ఇప్పటికే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చినందున తాము కూడా అందుకు అనుమతించక తప్పని పరిస్థితి తలెత్తిందని పేర్కొంటూ తెలంగాణ కూడా అందుకు సమాయత్తమైపోతోంది. ఇది కేవలం సాకు మాత్రమేనని, మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకోవడం ఏ ప్రభుత్వానికీ ఇష్టం ఉండదని, అందుకే వాటి విక్రయాలకు అనుమతిచ్చేశారన్నది మాత్రం బహిరంగ రహస్యం.

ఇప్పుడు మద్యం విక్రయాలకు అనుమతిస్తే వైరస్ వ్యాప్తి మళ్లీ చెలరేగే ప్రమాదం ఉందని వైద్యశాఖ హెచ్చరిస్తున్నా.. కనిపిస్తున్న ఆదాయంతో అవేవీ వినిపించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

బ్రేకింగ్ న్యూస్: పాక్ లో కూలిన 107మంది ఉన్న విమానం.!

పాకిస్థాన్, లాహోర్ నుంచి 107 మందితో కరాచీకి బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కి చెందిన A320 విమానం కరాచీ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో కూలిపోయింది. మలిర్ లోని, మోడల్ కాలనీ...

లైవ్ విజువల్స్: బెంగాల్, ఒడిశా, విశాఖలో అల్లకల్లోలం సృష్టిస్తున్న అంపన్ తుఫాన్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొదలైన అంపన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ భీభత్సం నేడు విశాఖ తీరం మరియు కాకినాడ తీరప్రాంతాల్లోనూ దాడి చేయడం మొదలు...

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

కరోనా ఎఫెక్ట్: సెన్సేషన్ అయిన యుఎస్ న్యూయార్క్ టైమ్స్ పత్రిక.!

ప్రస్తుతం ప్రపంచ జనాభాని, ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి పేరు కరోనా వైరస్. ఈ వైరస్ పుట్టింది చైనాలో అయినా భారీగా నష్టపోయింది మాత్రం ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా...

చైనా చిచ్చు.. భారత్ పై నేపాల్ ఓవరాక్షన్

కరోనా వైరస్ కు జన్మస్థానమైన చైనా కంటే, లక్షలాది కేసులతో అతలాకుతలమైన ఇటలీ కంటే భారత్ వల్లే తమకు ముప్పు ఎక్కువగా ఉందంటూ నేపాల్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చైనా, ఇటలీ నుంచి...