గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఉప్పెన అంటూ తొలి ప్రాజెక్ట్ తోనే తన సత్తా చాటిన బుచ్చి బాబు రెండో సినిమాకే గ్లోబల్ స్టార్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఎక్స్ క్లూజివ్ న్యూస్ బయటకు వచ్చింది.
RC 16వ సినిమాగా వస్తున్న ఈ సినిమా పవర్ క్రికెట్ నేపథ్యంతో వస్తుందని అంటున్నారు. క్రికెట్, కుస్తీ ఈ రెండు ఆటలతో సినిమా కథ ఉంటుందట. ఫస్ట్ హాఫ్ క్రికెట్ రెండో సగం కుస్తీ ఉంటాయట. అందుకే టైటిల్ కూడా ఈ రెండిటికీ కలిసి వచ్చేలా పెట్టాలని చిత్ర యూనిట్ అనుకుంటున్నారట.
ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా పవర్ క్రికెట్ అని చెబుతున్నారు. పవర్ క్రికెట్ టైటిల్ పేరు వినగానే మెగా ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది. ఇంతకీ ఈ పవర్ క్రికెట్ కథ ఏంటి సినిమాలో చరణ్ ఎలా కనిపిస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. అకాడమి విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. మరి గ్లోబల్ స్టార్ పవర్ క్రికెట్ ఎలా ఉంటుంది ఎన్ని రికార్డులను తిరగరాస్తుంది అన్నది సినిమా వచ్చాక తెలుస్తుంది.