RC 16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని సినిమా ‘RC16’ పేరుతో తెరెకెక్కుతోంది. నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న సినిమా మైసూర్ లో పది రోజులపాటు జరిగి మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
రామ్ చరణ్-జాన్వీ కపూర్ పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు టీమ్ రెండో షెడ్యూల్ ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉంది. సోమవారం నుంచి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ బూత్ బంగ్లా ప్రాంతంలో పది రోజులపాటు షూటింగ్ జరిపేందుకు ఏర్పాట్లు జరిగాయి. స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కుతున్న సినిమా కోసం గ్రౌండ్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సినిమా కోసం రామ్ చరణ్ మేకోవర్ ఆకట్టుకుంటోంది. ఇటివలి ఆయన పిక్స్ ను అభిమానులు వైరల్ చేస్తున్నారు.
మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు టీమ్ ప్రకటించాల్సి ఉంది.