RBI : మోడీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్ల ను రద్దు చేసిన సమయంలో రూ.2000 నోట్ల ను తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ నోట్లను ఇటీవల రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. రూ.2 వేల నోట్ల రద్దు నేపథ్యం లో ప్రజల వద్ద ఉన్న నోట్ల ను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సింది అంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే.
ఇప్పటికే 90 శాతం కు పైగా రూ.2 వేల నోట్లు ఆర్బీఐ కి చేరాయి. ఇంకా కూడా కొంత మంది వద్ద రూ.2000 నోట్లు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. డేట్ అయి పోయింది ఇప్పుడు ఆ నోట్లు వృదా అనుకుంటున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు కొత్త గడువు ఇచ్చింది.
అక్టోబర్ 7వ తారీకు వరకు రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు అంటూ ఆర్బీఐ అధికారికంగా ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ 7వ తారీకు వరకు కూడా రెండు వేల నోట్లు చెలామని అవుతాయి, చెల్లుబాటు అవుతాయి అంటూ ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యం లో ఇంకా నోట్లు ఉన్న వారు బ్యాంకులకు వెళ్లవచ్చు.
If you wabt tto increase youir knowledge onlpy kdep visiting thjs
website aand bbe updawted wit thhe newest infomation pposted here.