మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న డిస్కో రాజా షూటింగ్ ఆగిపోయిందంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది. దీంతో ఈ విషయం పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా ఆగిపోలేదు .. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ఈ నెల 24నుండి జరుపుతారని ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత రవితేజ కోసం పలువురు దర్శకులు క్యూ కడుతున్నారు.
తాజాగా రవితేజ కోసం దర్శకుడు అజయ్ భూపతి ఓ సిద్ధం చేసి ఆయనకు వినిపించే పనుల్లో ఉన్నాడట. గత ఏడాది ఆర్ ఎక్స్ 100 లాంటి సంచలన సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న అజయ్ భూపతి ఆ సినిమా తరువాత ఏడాది దాటినా కూడా ఇంతవరకు అయన మారే సినిమా చేయలేదు. ఇప్పటికే పలువురు హీరోలకు కథలు చెప్పారు. అయితే రవితేజ కోసం అజయ్ స్క్రిప్ట్ సిద్ధం చేసాడని ఆ స్క్రిప్ట్ వినిపించేందుకు టైం కూడా తీసుకున్నాడట.
ఇక రవితేజ కోసం ఒక్క అజయ్ భూపతి మాత్రమే కాదు .. గోపీచంద్ మలినేని, సంపత్ నంది ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరో వైపు తమిళ సూపర్ హిట్ తేరి రీమేక్ గా రవితేజ చేస్తున్న సినిమా కూడా సెట్స్ పై ఉంది. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి ఈ ముగ్గురు దర్శకులలో ఎవరి స్క్రిప్ట్ ని ముందు ఓకే చేస్తాడో మాస్ రాజా.